Guinness World Record: పుషప్‌లతో గిన్నిస్ రికార్డ్.. నయం చేయలేని వ్యాధిని, వ్యాయామంతో జయించిన అథ్లెట్..
పురుషుల విభాగంలో గతేడాది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ విజేత జరాద్ యంగ్ 100కు పైగా పుష్-అప్‌లను చేసి ఓ రికార్డ్ నెలకొల్పాడు. అయితే, ఆసీస్ అథ్లెట్ డేనియల్ స్కాలీ ఈ రికార్డును బద్దలు కొట్టినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకటించింది.

ఆస్ట్రేలియన్ ఆటగాడు తన జాయింట్ పెయిన్‌తో పోరాడుతూ, ఒక గంటలో 3,182 పుషప్‌లు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌ను బద్దలు కొట్టాడు. దీంతో ఈ ప్లేయర్ టైటిల్ కూడా గెలుచుకున్నాడు. పురుషుల విభాగంలో గతేడాది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ విజేత జరాద్ యంగ్ 100కు పైగా పుష్-అప్‌లను ప్రదర్శించాడు. అయితే, అథ్లెట్ డేనియల్ స్కాలీ ఈ రికార్డును బద్దలు కొట్టినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకటించింది. ఇది తనకు రెండో గిన్నిస్ టైటిల్ అని డేనియల్ పేర్కొన్నాడు. జరాద్ యంగ్ గత ఏడాది ఒక గంటలో 3,054 పుష్-అప్‌లు చేసిన రికార్డే ఇప్పటి వరకు అగ్రస్థానంలో నిలిచింది.
రికార్డు బద్దలు కొట్టడం వెనుక కథ..
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, డేనియల్ 12 సంవత్సరాల వయస్సులో అతని చేతి విరిగింది. ఫలితంగా, అతను కాంప్లెక్స్ రీజనల్ పెయిన్ సిండ్రోమ్ (CRPS) తో బాధపడేవాడు. ఇది అతనికి భరించలేని నొప్పిని మిగిల్చింది.




చేతి నొప్పి చాలా తీవ్రంగా ఉంది. చిన్న స్పర్శ, చేతి కదలిక, గాలి లేదా నీరు కూడా ఆ నొప్పిని మరింత పెంచేవి. చేయి నొప్పి కారణంగా డేనియల్ చాలా నెలలు ఆసుపత్రిలో ఉండవలసి వచ్చింది. కానీ, అతను వ్యాయామం, శారీరక దృఢత్వం ద్వారా ఈ భరించలేని నొప్పిని నయం చేసే మార్గాన్ని కనుగొన్నాడు.