Watch Video: అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆసక్తికర సీన్.. 8వ ఓవర్‌లో పొదల్లోకి దూరిన ఆటగాళ్లు.. ఎందుకో తెలుసా?

ఇంగ్లండ్, నెదర్లాండ్స్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో 8వ ఓవర్లో నెదర్లాండ్స్ ఆటగాళ్లు పొదల్లోకి వెళ్లారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.

Watch Video: అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆసక్తికర సీన్.. 8వ ఓవర్‌లో పొదల్లోకి దూరిన ఆటగాళ్లు.. ఎందుకో తెలుసా?
Watch Video
Follow us
Venkata Chari

|

Updated on: Jun 17, 2022 | 6:05 PM

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, నెదర్లాండ్స్(england vs netherlands) మధ్య తొలి మ్యాచ్ ఆమ్‌స్టెల్‌వీన్‌లో జరుగుతోంది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేయాల్సి వచ్చింది. కేవలం ఒక పరుగుకే జాసన్ రాయ్ రూపంలో ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత డేవిడ్ మలాన్, ఫిలిప్ సాల్ట్ వేగంగా పరుగులు జోడించారు. వీరిద్దరూ డబుల్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. డేవిడ్ మలన్ తన అద్భుతమైన సెంచరీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అయితే, మలాన్ కొట్టిన ఓ సిక్సర్ అంతర్జాతీయ మ్యాచ్‌లో అద్భుతమైన డ్రామాగా మారింది.

పొదల్లోకి దూరిన ఆటగాళ్లు..

ఇవి కూడా చదవండి

ఈ సిక్స్ తర్వాత బంతి కనిపించకుండా పోయింది. నెదర్లాండ్స్ ఆటగాళ్ళు మ్యాచ్ నుంచి బయటకు వెళ్లి పొదల్లో బంతి కోసం వెతుకుతూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. 8వ ఓవర్‌లో ఇలాంటి సీన్ కనిపించింది. పీటర్ వేసిన బంతిని లాంగ్‌ ఓవర్‌లో మలన్ అద్భుతంగా సిక్సర్ కొట్టాడు. సరిహద్దుల్లోని పొదల్లో బంతి పడింది. దీంతో మైదానం సిబ్బంది, ఆటగాళ్లు బంతిని వెతకడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మలన్ తన వన్డే కెరీర్‌లో 90 బంతుల్లోనే తొలి సెంచరీని నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ 7 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు.

టీ20 కప్ సన్నాహాలపై పూర్తి దృష్టి..

సిరీస్ ప్రారంభం కావడానికి ముందు, ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అనేక ద్వైపాక్షిక సిరీస్‌లు, T20 ప్రపంచ కప్‌తో కూడిన రాబోయే సీజన్‌లో టీం ఎలా ఆడనుందో చూపిస్తున్నాడు. సరైన ఆటగాళ్లను సరైన పాత్రల్లోకి తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని ఇంగ్లీష్ కెప్టెన్ చెప్పుకొచ్చాడు. ప్రపంచకప్ సన్నాహాల్లో జులై నెల మాకు చాలా ముఖ్యమైనది. జులైలో భారత్, దక్షిణాఫ్రికా లాంటి బలమైన జట్లతో ఆడాల్సి ఉందని తెలిపాడు.

అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!