AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL: ఇకపై రెండు భాగాలు, రెండు దేశాలు.. ఐపీఎల్ నిర్వహణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పంజాబ్ కింగ్స్ ఓనర్..

ఐపీఎల్‌ను సుదీర్ఘకాలం నిర్వహించేందుకు పంజాబ్ కింగ్స్ సహ యజమాని నెస్ వాడియా బీసీసీఐకి సూపర్ ఫార్ములాను సూచించారు.

IPL: ఇకపై రెండు భాగాలు, రెండు దేశాలు.. ఐపీఎల్ నిర్వహణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పంజాబ్ కింగ్స్ ఓనర్..
IPL
Venkata Chari
|

Updated on: Jun 17, 2022 | 9:06 PM

Share

పంజాబ్ కింగ్స్ (PBKS) సహ-యజమాని నెస్ వాడియా, భారత క్రికెట్ బోర్డు (BCCI) మీడియా హక్కుల ద్వారా భారీగా రూ. 48 కోట్లు పొందిందని, ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ని రెండు వేర్వేరు భాగాలుగా నిర్వహించాలని పేర్కొ్నాడు. బీసీసీఐ ఐపీఎల్ మీడియా హక్కులను ఇ-వేలం ద్వారా రూ. రూ.48, 390 కోట్లకు విక్రయించిన సంతగి తెలిసిందే. ఇది గతంలో కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. వచ్చే ఐదేళ్లలో ఐపీఎల్‌లో 94 మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) భవిష్యత్ టూర్ షెడ్యూల్ (ఎఫ్‌టీపీ) ప్రకారం ఐపీఎల్‌కు రెండున్నర నెలల సమయం ఉంటుందని బీసీసీఐ కార్యదర్శి జైషా ఇప్పటికే చెప్పిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో మరిన్ని దేశవాళీ మ్యాచ్‌లు జరుగుతాయని, దాని సీజన్ పొడిగించే అవకాశం ఉందని వాడియా ఆశాభావం వ్యక్తం చేశాడు.

అతను పీటీఐతో మాట్లాడుతూ, ‘ఐపీఎల్ క్రికెట్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది. IPL క్రికెట్‌కు అవసరమైన శక్తిని అందించింది. దానిని ప్రపంచ క్రీడగా మార్చింది. ఇప్పుడు ఐపీఎల్ మరింత పెద్దదవుతుంది’ అని తెలిపాడు.

వాడియా మాట్లాడుతూ, ‘ప్రస్తుతం హోమ్‌గ్రౌండ్‌లో 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడుతున్నారు. ఇది చాలా తక్కువ. వాటి సంఖ్య కనీసం 14 ఉండాలి. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ చాలా కాలం పాటు కొనసాగుతుందని నేను నిజంగా భావిస్తున్నానంటూ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

నాలుగు నెలల పాటు ఐపీఎల్‌ను నిర్వహించలేకపోతే రెండు భాగాలుగా ఎందుకు నిర్వహించకూడదని ఆయన అన్నారు. ఈ సెషన్లలో ఒకటి భారతదేశంలో, మరొకటి మరే దేశంలోనైనా నిర్వహించవచ్చు. భారతీయులు ప్రపంచంలో ప్రతిచోటా ఉన్నారు. ఇప్పుడు ఐపీఎల్‌లో మరిన్ని మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చాడు.

Follow Us
యాపిల్‌ ఫోన్‌ మినీ సిరీస్‌పై షాకింగ్ నిర్ణయం
యాపిల్‌ ఫోన్‌ మినీ సిరీస్‌పై షాకింగ్ నిర్ణయం
8 గంటలు నిద్రపోయినా ఉదయాన్నే అలసటగా ఉంటుందా? కారణం ఇదే..!
8 గంటలు నిద్రపోయినా ఉదయాన్నే అలసటగా ఉంటుందా? కారణం ఇదే..!
హైసెన్స్‌ ఏ10, ఏ10 అల్ట్రా ఫోన్‌ డిస్‌ప్లే గురించి తెలుసా
హైసెన్స్‌ ఏ10, ఏ10 అల్ట్రా ఫోన్‌ డిస్‌ప్లే గురించి తెలుసా
పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్
పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్
కేవలం సినిమా స్నాక్ మాత్రమే కాదు.. పాప్‌కార్న్‌తో ఈ లాభాలు తెల్సా
కేవలం సినిమా స్నాక్ మాత్రమే కాదు.. పాప్‌కార్న్‌తో ఈ లాభాలు తెల్సా
ఎలుక తోక ఎందుకు పొడవు ఉంటుంది? దీంతో ఏమైనా ఉపయోగం ఉంటుందా?
ఎలుక తోక ఎందుకు పొడవు ఉంటుంది? దీంతో ఏమైనా ఉపయోగం ఉంటుందా?
నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి
నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి
ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?
ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?
ఈ యాప్స్‌ ఉంటే గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు
ఈ యాప్స్‌ ఉంటే గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్