Viral Video: ఏం బాబూ.. ఆ బంతిని కూడా అంతలా బాదాలా? నెట్టింట్లో వైరలవుతోన్న బట్లర్ వెరైటీ సిక్స్..
Jos Buttler Six: ఇంగ్లండ్ వన్డే వైస్ కెప్టెన్ జోస్ బట్లర్ (Jos Buttler) ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఏ ఫార్మాటైనా పరుగుల వరద పారిస్తున్నాడు. ఐపీఎల్-2022లో నాలుగు సెంచరీలతోమొత్తం863 రన్స్ తో ఐపీఎల్ టాప్ స్కోరర్లలో ఒకరిగా నిలిచాడు. ఇప్పుడు అదే ఫామ్ ను నెదర్లాండ్స్‌తో జరిగిగిన మూడు వన్డేల

Jos Buttler Six: ఇంగ్లండ్ వన్డే వైస్ కెప్టెన్ జోస్ బట్లర్ (Jos Buttler) ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఏ ఫార్మాటైనా పరుగుల వరద పారిస్తున్నాడు. ఐపీఎల్-2022లో నాలుగు సెంచరీలతోమొత్తం863 రన్స్ తో ఐపీఎల్ టాప్ స్కోరర్లో ఒకరిగా నిలిచాడు ఇప్పుడు అదే ఫామ్ ను నెదర్లాండ్స్‌తో జరిగిగిన మూడు వన్డేల సిరీస్‌లో కూడా కొనసాగించాడు. మొదటి వన్డేలో 162 పరుగుల మెరుపు ఇన్నింగ్‌తో ఇంగ్లాండ్ జట్టు చరిత్రాత్మక స్కోర్ 498/4 చేయడంతో కీలకపాత్ర పోషించాడు. తాజాగా మరోసారి బ్యాట్ ఝుళిపించాడు బట్లర్. ఈనేపథ్యంలో మూడో వన్డేలో అతను కొట్టిన ఒక సిక్స్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాసింత జాలి కూడా లేదా?




ఆమ్‌స్టల్‌వీన్ వేదికగా బుధవారం జరిగిన మూడో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 49.2 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. ఆతర్వాత ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. జేసన్ రాయ్ (101; 86 బంతుల్లో 15×4)తో శతకంతో రాణించగా.. బట్లర్ (86 నాటౌట్; 56 బంతుల్లో 7×4, 5×6) మరోసారి సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలోనే బట్లర్ ఓ విచిత్రమైన బంతికి సిక్సర్ బాదడం గమనార్హం. ఇన్నింగ్స్ 29వ ఓవర్‌లో పాల్ మీక్రెన్ ఒక బంతిని బౌన్సర్‌గా వేద్దామని చూడగా అది రెండు స్టెప్పులు పడింది. మొదటిసారి పిచ్‌మీదే స్టెప్ అయిన బంతి రెండోసారి లెగ్‌సైడ్‌లో పిచ్ దాటి పడింది. అయితే ఈ సమయంలో క్రీజును దాటి ముందుకొచ్చిన బట్లర్ ఆ బంతి వద్దకెళ్లి సిక్సర్ బాదేశాడు. ఈ బంతిని నోబాల్‌గా ప్రకటించడంతో మరుసటి బంతిని కూడా అలాగే నేరుగా స్టాండ్స్‌లోకి పంపించాడు. ఇప్పుడు ఈ రెండు స్టెప్పుల బంతి వీడియో నెట్టింట్లో వైరలవుతోంది. ‘ ఏం బాబూ బట్లరూ.. ఆ బంతిని కూడా వదలవా?’ ‘నీకు జాలి, దయ అంటూ ఏమీ లేవా’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా సెంచరీతో మెరిసిన రాయ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రాగా.. సిరీస్‌లో 248 పరుగులు చేసిన బట్లర్‌కే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ పురస్కారం దక్కింది.
?????? pic.twitter.com/SYVCmHr2iD
— Sachin (@Sachin72342594) June 22, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..