David Warner: వార్నర్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. కెప్టెన్సీ బ్యాన్‌పై కీలక నిర్ణయం తీసుకోనున్న క్రికెట్‌ ఆస్ట్రేలియా!

David Warner: సుమారు నాలుగేళ్ల క్రితం జరిగిన బాల్‌ టాంపరింగ్‌ వివాదం క్రికెట్‌ ఆస్ట్రేలియాను ఓ కుదుపు కుదిపేసింది. 2018లో దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు సందర్భంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు బాల్ ట్యాంపరింగ్ పాల్పడ్డారు

David Warner: వార్నర్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. కెప్టెన్సీ బ్యాన్‌పై కీలక నిర్ణయం తీసుకోనున్న క్రికెట్‌ ఆస్ట్రేలియా!
David Warner
Follow us
Basha Shek

|

Updated on: Jun 23, 2022 | 9:59 PM

David Warner: నాలుగేళ్ల క్రితం జరిగిన బాల్‌ టాంపరింగ్‌ వివాదం క్రికెట్‌ ఆస్ట్రేలియాను ఓ కుదుపు కుదిపేసింది. 2018లో దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు సందర్భంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు బాల్ ట్యాంపరింగ్ పాల్పడ్డారు. ఈ ఘటన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు మాయని మచ్చలా మిగిలిపోయింది. ఇక  ఈ ఘటన జరగిన సమయంలో అప్పటి కెప్టెన్‌ స్టీవ్ స్మిత్‌, వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ (David Warner) , కామెరూన్‌ బెన్‌ క్రాఫ్ట్‌పై క్రికెట్‌ ఆస్ట్రేలియా ఏడాది కాలం పాటు నిషేదం విధించింది. ఇక నిషేధం ముగిసిన ఏడాది వరకు స్మిత్‌ను కెప్టెన్సీకి అనర్హుడిగా ప్రకటించారు. అదే విధంగా డేవిడ్‌ వార్నర్‌ కెప్టెన్సీపై క్రికెట్‌ ఆస్ట్రేలియా జీవిత కాల నిషేధం విధించింది. అయితే తాజా పరిణామాల ప్రకారం.. వార్నర్‌ కెప్టెన్సీపై జీవిత కాల నిషేధం ఎత్తి వేసే యోచనలో క్రికెట్‌ ఆస్ట్రేలియా ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా సారథిగా ఐపీఎల్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు వార్నర్‌. ఒకవేళ వార్నర్‌పై బ్యాన్‌ ఎత్తివేస్తే ఆసీస్ లో జరిగే ప్రతిష్ఠాత్మక బిగ్ బాష్ లీగ్ లో అతను కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. డేవిడ్‌ గతంలో సిడ్నీ సిక్సర్స్ తరఫున ఆడేవాడు. ఇక ఆసీస్‌ టెస్ట్‌ జట్టుకు ప్యాట్‌ కమిన్స్‌ నాయకత్వం వహిస్తుండగా.. వన్డే,టీ 20ల్లో అరోన్‌ ఫించ్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఫించ్‌ బ్యాటర్‌గానే కాకుండా సారథిగా కూడా విఫలమవుతున్నాడు. మరోవైపు మూడు ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్నాడు డేవిడ్‌ భావయ్‌. ఈ నేపథ్యంలో నిషేధం ఎత్తివేస్తే అతనికి జాతీయ జట్టుకు సారథ్యం వహించే అవకాశం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..