Ind Vs Eg: లీసెస్టర్‌షైర్ జట్టుతో ఇండియా వార్మప్ మ్యాచ్.. ప్రత్యర్థి జట్టులో కూడా మనవాళ్లే ఉంటే..
ఇంగ్లాండ్‌తో టెస్ట్‌కు ముందు భారత్ వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. ఈ వార్మప్ మ్యాచ్ గురువారం ప్రారంభమైంది. లీసెస్టర్‌షైర్ జట్టుతో వార్మప్ మ్యాచ్‌లో ఇండియా మొదటి రోజు ఎనిమిది వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది...
ఇంగ్లాండ్‌తో టెస్ట్‌కు ముందు భారత్ వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. ఈ వార్మప్ మ్యాచ్ గురువారం ప్రారంభమైంది. లీసెస్టర్‌షైర్ జట్టుతో వార్మప్ మ్యాచ్‌లో ఇండియా మొదటి రోజు ఎనిమిది వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. కేఎస్ భరత్ హాఫ్‌సెంచరీ చేయడంతో పాటు కోహ్లీ 33 పరుగులు చేశాడు. దీంతో భారత్ 200 మార్క్‌ను దాటింది. ఓ దశలో ఇండియా 82 పరుగులకే ఐదు వికెట్ల కోల్పోయింది. కోహ్లీ, భరత్ కుమార్‌తో కలిసి 57 పరుగుల భాగస్వామ్యాం నెలకొల్పాడు. వీరి జోడిని వాల్కర్ విడగొట్టాడు. కోహ్లీని ఎల్బీగా వెనక్కు పంపాడు. శ్రేయస్ అయ్యర్ డకౌట్ అయ్యాడు. హనుమ విహారి (3), జడేజా (13), శార్దూల్ ఠాకూర్ (6) విఫలమయ్యారు. ఉమేశ్ యాదవ్ 23 పరుగులతో కాస్త దూకుడుగా ఆడాడు.
అయితే లీసెస్టర్‌షైర్ జట్టులో భారత ఆగాళ్లు ఉండడం విశేషం. రిషభ్ పంత్, ఛెతేశ్వర్ పుజారా, జస్ప్రిత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ లీసెస్టర్‌షైర్‌కు ఆడారు. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆసక్తికర సన్నివేశం జరిగింది. మైదానంలోకి వస్తున్న ఇరుజట్ల ఆటగాళ్లకు అపూర్వ స్వాగతం లభించింది. కొంతమంది డోలు వాయిస్తుండగా పంజాబీ సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళా నృత్యకారులు భాంగ్రా డ్యాన్స్ చేస్తూ ఆటగాళ్లకు స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఐదో టెస్టు జులై 1 నుంచి ప్రారంభంకానుంది.