AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: జో రూట్ మ్యాజిక్‌ను కాపీ కొట్టబోయి నవ్వులపాలైన కోహ్లీ.. వైరల్ వీడియో..

India vs Leicestershire: టీమిండియా దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్‌ను కాపీ కొట్టిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

Watch Video: జో రూట్ మ్యాజిక్‌ను కాపీ కొట్టబోయి నవ్వులపాలైన కోహ్లీ.. వైరల్ వీడియో..
Virat Kohli
Venkata Chari
|

Updated on: Jun 23, 2022 | 9:05 PM

Share

భారత మాజీ కెప్టెన్, వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ప్రస్తుతం లీసెస్టర్‌లో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్నాడు. అయితే, ఈ మ్యాచ్‌లో కోహ్లీ చేసిన ఓ పని, నెట్టింట్లో నవ్వులు పూయిస్తోంది. ఏదో చెయ్యాలనుకుంటే ఇంకేదో అవ్వడంతో సోషల్ మీడియాలో అపహాస్యం పాలయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ మాజీ టెస్టు కెప్టెన్ జో రూట్‌(Joe Root)ను కాపీ కొట్టేందుకు కోహ్లీ ప్రయత్నించి ఘోరంగా విఫలమయ్యాడు. కోహ్లీకి సంబంధించిన ఈ వీడియోను అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు.

కోహ్లీ వీడియో వైరల్‌..

ఇవి కూడా చదవండి

న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో జో రూట్ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో, అతను తన బ్యాట్‌ను తాకకుండా మైదానంలో బ్యాలెన్స్ చేస్తూ కనిపించాడు. అభిమానులు దీనిని మ్యాజిక్ అని పిలుస్తూ, తెగ వైరల్ చేశారు.

రూట్‌ను కాపీ కొట్టడంలో విఫలమైన కోహ్లీ..

కోహ్లి కూడా ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇలాగే ప్రయత్నించి ఘోరంగా విఫలమయ్యాడు. కోహ్లి మైదానంలో నిలబడి తన బ్యాట్‌ను బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. కోహ్లి రూట్‌ని కాపీ కొట్టిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

రూట్ చేసింది మ్యాజిక్ కాదు..

జో రూట్ వీడియోలో ఎలాంటి మ్యాజిక్ లేదు. అతని బ్యాట్‌లోనే అసలు విషయం దాగి ఉంది. రూట్ ఉపయోగించే బ్యాట్ ఫ్లాట్ బొటనవేలు కలిగి ఉంటుంది. అందులో చిన్న ట్విస్ట్ కూడా లేదు. ఇది కాకుండా, రూట్ బ్యాట్ కింది భాగం చాలా వెడల్పుగా ఉంటుంది. ఈ కారణంగా అతను చక్కగా బ్యాలెన్స్ చేశాడు. జో రూట్ బ్యాట్ సపోర్టు లేకుండా పైకి లేవడానికి ఇదే కారణం. ఈ బ్యాట్‌తో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. జో రూట్ తన సెంచరీ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లతో 10,000 టెస్ట్ పరుగులను కూడా పూర్తి చేశాడు.

ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 69 బంతుల్లో 33 పరుగులు చేసి, పెవిలియన్ చేరాడు. ఇందులో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. భారత్ ప్రస్తుతం 8 వికెట్లు కోల్పోయి 241 పరుగులు సాధించింది. రోహిత్ 25, గిల్ 21, విహారి 3, అయ్యర్ 0, జడేజా 13, ఠాకూర్ 6, ఉమేష్ యాదవ్ 23 పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం శ్రీకర్ భరత్ 67, షమీ 16 పరుగులతో క్రీజులో నిలిచారు.