AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Katrina Kaif: మన మల్లీశ్వరి ఇంత అందంగా మెరిసిపోవడానికి కారణమదేనట.. తన బ్యూటీ అండ్‌ డైట్‌ సీక్రెట్స్‌ చెప్పేసిన కత్రినా..

Katrina Beauty Secrets: కత్రినా కైఫ్‌.. సినిమా ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. మల్లీశ్వరి సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులను కూడా పలకరించిందీ ముద్దుగుమ్మ. ఇటీవల తన ప్రియుడు హీరో విక్కీ కౌశల్‌ (Vicky Kaushal)ను పెళ్లాడి ..

Katrina Kaif: మన మల్లీశ్వరి ఇంత అందంగా మెరిసిపోవడానికి కారణమదేనట.. తన బ్యూటీ అండ్‌ డైట్‌ సీక్రెట్స్‌ చెప్పేసిన కత్రినా..
Katrina
Basha Shek
| Edited By: Rajeev Rayala|

Updated on: Jun 24, 2022 | 2:19 PM

Share

Katrina Beauty Secrets: కత్రినా కైఫ్‌.. సినిమా ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. మల్లీశ్వరి సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులను కూడా పలకరించిందీ ముద్దుగుమ్మ. ఇటీవల తన ప్రియుడు హీరో విక్కీ కౌశల్‌ (Vicky Kaushal)ను పెళ్లాడి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. పెళ్లికి ముందు సినిమాల్లో సక్సెస్‌ఫుల్‌ కెరీర్‌ను కొనసాగిస్తోన్న క్యాట్ మళ్లీ షూటింగ్‌లలో బిజీగా మారిపోయింది. ఇదిలా ఉంటే రీల్‌ లైఫ్‌లోనే కాదు రియల్‌గానూ ఎంతో అందంగా ఉంటుంది కత్రినా. మిలమిలా మెరిసే చర్మం ఈ ముద్దుగుమ్మ సొంతం. కొన్నిసార్లు ఆమె వయస్సును కూడా అసలు ఊహించలేం. అందుకే అందంలో చాలామంది అమ్మాయిలకు కత్రినా (Katrina Kaif) నే రోల్‌ మోడల్‌. మరి ఇంత అందంగా కనిపించేందుకు ఈ అందాల తార ఏం చేస్తుందో, ఎలాంటి డైట్‌ తీసుకుంటుందో తెలుసుకుందాం రండి.

ఓట్స్, తేనె ఫేస్ ప్యాక్.. కత్రినా తన చర్మాన్ని ఆరోగ్యంగా, తాజాగా ఉంచుకోవడానికి ఓట్స్, తేనెతో చేసిన ఫేస్ ప్యాక్‌ని వినియోగిస్తానని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇది కాకుండా, నిద్రలేచిన వెంటనే ఐస్ వాటర్‌లో తన ముఖాన్ని ముంచుతుంది. ఇక ఫేస్‌ క్లీనింగ్‌ కోసం రోజ్ వాటర్‌ను ఉపయోగిస్తుంది. కాగా చర్మంలోని మృతకణాలను తొలగించేందుకు ప్రతి 15 రోజులకోసారి క్లీనప్ చేస్తుంది. అంతే కాకుండా రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత నైట్‌క్రీమ్‌ అప్లై చేస్తుంది.

మాక్రోబయోటిక్ డైట్.. చర్మం ఆరోగ్యంగా, మెరుస్తూ ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం కూడా చాలా ముఖ్యమని కత్రినా చెబుతుంది. దీని కోసం, ఆమె మాక్రోబయోటిక్ డైట్‌ని ఫాలో అవుతుంది. ఇందులో భాగంగా బ్రౌన్ రైస్, బీన్స్, సీఫుడ్, కూరగాయలను ఎక్కువ తీసుకుంటుంది. ఇవి కాకుండా ఫైబర్ బాగా దొరికే ఫుడ్స్‌కు డైట్‌లో భాగమిస్తుంది. ఇవి ఆరోగ్యంగా ఉంచడంతో పాటు బరువును సమతుల్యంగా ఉంచుతాయి. ఇక ప్రతి 2 గంటలకు తాజాగా ఉడికించిన కూరగాయలు, పండ్లను కూడా తింటుందట క్యాట్. వీలైనంతవరకు పిండి పదార్థాలకు దూరంగా ఉంటుంది. కత్రినా డైట్‌లో ఎకై బెర్రీ, వైట్ గ్రాస్ పౌడర్ వంటి సప్లిమెంట్స్ కూడా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

4 గ్లాసుల నీటితో రోజు ప్రారంభం.. బాడీని, స్కిన్‌ను హైడ్రేట్ గా ఉంచడానికి, కత్రినా పుష్కలంగా నీరు తాగుతుంది. వీటితో పాటు తరచూ ఇతర ద్రవ పదార్థాలను తీసుకుంటుంది. ఉదయం 4 గ్లాసుల నీరు తాగడంతోనే కత్రినా దినచర్య ప్రారంభమవుతుంది. ఇలా నీరు ఎక్కువగా తాగడం వల్ల జీవక్రియ రేటు మెరుగుపడుతుండట. అలాగే శరీరంలోని విష పదార్థాలు కూడా బయలకు వెళతాయట. వీటితో పాటు రెగ్యులర్ వర్కౌట్స్ కూడా తన హెల్దీ అండ్‌ ఫిట్‌ బాడీకి కారణమంటోంది క్యాట్.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..