Copper Water: రాగి పాత్రల్లో నీటిని తాగుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయద్దు..

Copper Water Benefits: రాగి పాత్రలో ఉంచిన నీరు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. ఇది మన దేశంలోని పురాతన సంప్రదాయంలో ఒక భాగం, ఆయుర్వేద వైద్య విధానంలో కూడా ఒక భాగం. రాగి పాత్రలో ఉంచిన

Copper Water: రాగి పాత్రల్లో నీటిని తాగుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయద్దు..
Copper Water Benefits
Follow us
Basha Shek

|

Updated on: Jun 23, 2022 | 5:47 PM

Copper Water Benefits: రాగి పాత్రలో ఉంచిన నీరు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. ఇది మన దేశంలోని పురాతన సంప్రదాయంలో ఒక భాగం, ఆయుర్వేద వైద్య విధానంలో కూడా ఒక భాగం. రాగి పాత్రలో ఉంచిన నీటిని తాగడం వల్ల కలుషిత నీరు తాగడం వల్ల వచ్చే అనేక వ్యాధులు దూరమవుతాయి. ఉదాహరణకు లూజ్ మోషన్, పొత్తికడుపు నొప్పి, విరేచనాలు మొదలైనవి. రాగి నీటిని తాగడం వల్ల శరీరంలో కాపర్ లోపం ఉండదు. అయితే అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లు కాపర్‌ నీటిని తీసుకోవడంలోనూ కొన్ని పరిమితులున్నాయి. అదేవిధంగా కాపర్‌ వాటర్‌ వినియోగంలోనూ కొందరు పొరబాట్లు, తప్పులు చేస్తుంటారు. ఇవి అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి. మరి అవేంటో తెలుసుకుందాం రండి.

రాత్రి పూట తాగొచ్చా అంటే?

ఇవి కూడా చదవండి

భోజనం చేసిన తర్వాత రాగి పాత్రలో ఉంచిన నీటిని ఎప్పుడూ సేవించకూడదు. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియపై చెడు ప్రభావం పడుతుంది. జీర్ణక్రియ మందగించవచ్చు లేదా కడుపు నొప్పి సమస్యలు కూడా తలెత్తవచ్చు. అదేవిధంగా రాత్రి నిద్రపోయే సమయంలోనూ రాగి పాత్రలో ఉంచిన నీటిని తాగకూడదు. ఆయుర్వేదం ప్రకారం ఉదయం ఖాళీ కడుపుతో కాపర్‌ వాటర్‌ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.

ఎక్కువైతే అంతే..

రాగి పాత్రలో ఉంచిన నీటి ప్రయోజనాన్ని పొందడానికి ఈ నీటిని రాగి పాత్రలో 12 నుండి 48 గంటల పాటు నిల్వ చేసి, ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. మీరు రోజంతా రాగి పాత్రలో నీరు తాగాలనుకుంటే, దాని వల్ల ఎటువంటి హాని ఉండదు. అయితే ఈ నీటిని తాజాగా నింపాలి. రాత్రిపూట నిల్వ ఉంచిన నీటిని ఉదయం ఖాళీ కడుపుతో మాత్రమే తాగాలి. ఇక రాగి పాత్రలో ఉంచిన నీటిని పరిమిత పరిమాణంలో తాగాలి. 2 లీటర్ల కంటే ఎక్కువ తాగితే మాత్రం కడుపు నొప్పి, గ్యాస్ లేదా అసిడిటీ సమస్యలు తలెత్తవచ్చు. ఇక శరీరంలో అధిక మొత్తంలో రాగి స్థాయులు ఉంటే వికారం, వాంతులు, కడుపు నొప్పి లేదా అతిసారం వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఒక్కోసారి ఇవి కాలేయ వైఫల్యం, మూత్రపిండాల వ్యాధులకు కూడా ఆస్కారం కల్పిస్తుంది. ఇర రాగి పాత్రలో నీటిని ఉంచినప్పుడల్లా నేలపై ఉంచకూడదు. చెక్క స్టూల్ లేదా ఇతర వస్తువులపై కాపర్‌ బాటిల్స్‌ ఉంచడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల రాగి స్వచ్ఛత మిగులుతుందని నిపుణులు చెబుతుంటారు.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే