Bone Health Tips: ఈ మూడు ఆహార పదార్థాలు మీ ఎముకలను మరింత దృఢంగా మార్చేస్తాయి..!

Bone Health Tips: ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రజలు కీళ్ల నొప్పులు, ఎముకల నొప్పులతో బాధపడుతున్నారు. కూర్చున్నా? నిల్చున్నా?

Bone Health Tips: ఈ మూడు ఆహార పదార్థాలు మీ ఎముకలను మరింత దృఢంగా మార్చేస్తాయి..!
Bone Health
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 23, 2022 | 5:10 PM

Bone Health Tips: ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రజలు కీళ్ల నొప్పులు, ఎముకల నొప్పులతో బాధపడుతున్నారు. కూర్చున్నా? నిల్చున్నా? తీవ్ర అవస్థలు పడుతున్నారు. కీళ్ల నొప్పుల కారణంగా నేలపై కూర్చుని లేవాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీనంతటికీ కారణం.. ఆహారంలో పోషకాల లోపమే. ముఖ్యంగా వయసు పెరిగే కొద్ది ఈ సమస్యలు ఎక్కువగా వస్తాయి. అయితే, సరైన ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవడంతో పాటు.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సరైన ఆహార పదార్థాలు అవసరం అంటున్నారు పోషకాహార నిపుణులు. ముఖ్యంగా 3 రకాల ఆహార పదార్థాలను సూచించారు పోషకాహార నిపుణులు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

నువ్వులు: నువ్వులు మార్కెట్‌లో ఈజీగా లభిస్తాయి. వీటిలో ఫాస్పరస్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే పోషకాలు ఎముకలను మరింత దృఢంగా మార్చుతాయి.

బీన్స్: బీన్స్ కూడా ఎముకల ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఎముకల ఆరోగ్యానికి అనుకూలమైన పోషకాల పవర్ హౌస్ ఈ బీన్స్ అంటారు పోషకాహార నిపుణులు. వీటిలో కాల్షియం, ఫాస్పరస్ అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా మారుస్తాయి. కిడ్నీ బీన్స్, ఎడామామ్ వంటి వాటిని తీసుకోవడం ద్వారా ఎముకల నొప్పుల సమస్య ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

రాగులు: రాగులు కూడా ఎముకల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఇందులో ఉండే పోషకాలు.. ఎముకలను స్ట్రాంగ్‌గా మారుస్తాయి. రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలకు అద్భుత శక్తిని ఇస్తుంది రాగి చిల్లా, పాన్‌ కేక్‌లు, రోటీలు, మరిన్ని రకాలుగా తయారు చేసి పిల్లలకు తినిపిస్తే ప్రయోజనం ఉంటుంది.

వీటితో పాటు మరికొన్ని పదార్థాలు కూడా ఎముకలను దృఢంగా మారుస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవి.. పైనాపిల్, బచ్చలికూర, వాల్ నట్స్, అరటిపండ్లు, బొప్పాయి. వీటిలో ఉండే పోషకాలు ఎముకలకు శక్తిని ఇచ్చి.. అనేక సమస్యలను దూరం చేస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!