PM Modi Meets Droupadi Murmu: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముతో భేటీ అయిన ప్రధాని మోదీ..

PM Modi Meets Droupadi Murmu: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మును ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు. ఎన్డీయే కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా..

PM Modi Meets Droupadi Murmu: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముతో భేటీ అయిన ప్రధాని మోదీ..
Pm Modi
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 23, 2022 | 5:20 PM

PM Modi Meets Droupadi Murmu: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మును ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు. ఎన్డీయే కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు చేయడానికి ముందు ప్రధాని మోదీ ఆమెతో భేటీ అయ్యారు. ద్రౌపది ముర్ము ని అధ్యక్ష పదవికి నామినేట్ చేయడాన్ని భారత సమాజంలోని అన్ని వర్గాలు మెచ్చుకున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. అలాగే, ‘‘క్షేత్రస్థాయిలో అట్టడుగు ప్రజల సమస్యలపై ఆమెకున్న అవగాహన, భారతదేశ అభివృద్ధికి సంబంధించిన దృక్పథం అత్యధ్భుతం’’ అని ప్రధాని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతకుముందు ప్రధాని మోదీ.. ‘‘సమాజానికి సేవ చేయడానికి, పేదలకు సాధికారత కోసం తన జీవితాన్ని అంకితం చేశారు’’ అని ద్రౌపది ముర్ముపై ప్రశంసలు కురిపించారు. ఆమె మన దేశానికి గొప్ప రాష్ట్రపతి అవుతారనే నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ.

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మంగళవారం సాయంత్రం తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ప్రకటించగా.. ప్రతిపక్ష పార్టీలు దేశ అత్యున్నత పదవికి మాజీ ఆర్థిక మంత్రి అయిన యశ్వంత్ సిన్హా పేరును ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

ద్రౌపది ముర్ము ఎవరు?

1958లో జన్మించిన ద్రౌపది ముర్ము.. గిరిజన సమాజానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఒడిశాకు చెందిన 64 ఏళ్ల ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికైతే.. భారత తొలి గిరిజన రాష్ట్రపతిగా చరిత్రకెక్కుతారు. జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేసిన మొదటి గిరిజన మహిళగా కూడా ఆమె గుర్తింపు పొందారు. నవీన్ పట్నాయక్, బిజెపి మద్దతుతో ఒడిశాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయంలో రాష్ట్ర కేబినెట్‌ మంత్రిగా కూడా పని చేశారు. ఇకపోతే ఒడిశా నుంచి రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయడంతో.. నవీన్ పట్నాయక్ సైతం ఎన్డీయేకే మద్ధతు తెలుపుతున్నారు.

ప్రతిపక్షానికి పెద్ద దెబ్బ..!

రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్ము ఎంపిక ప్రతిపక్ష శిబిరానికి పెద్ద దెబ్బగానే చెప్పొచ్చు. ఎందుకంటే.. జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన ముర్ము.. ఆ రాష్ట్ర ప్రభుత్వంతో, అక్కడి ప్రజలు మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. అదే సమయంలో ఆమె ఒక గిరిజన మహిళ కావడం, జార్ఖండ్‌లో మెజార్టీ ప్రజలు గిరిజనులే కావడంతో.. ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్న యూపీఏ మిత్రపక్షమైన జార్ఖండ్ ముక్తి మోర్చాకు పెద్ద సంకటంగా మారింది. ఆమెకు మద్దతు తెలుపకపోతే గిరిజనుల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా ఉంది. ఇదే ఇప్పుడు ప్రతిపక్ష శిభిరంలో కలకలం రేపుతోంది. అయితే, ప్రతిపక్షాలు బలపరిచిన యశ్వంత్ సిన్హాకే మద్ధతు తెలిపేందుకు జేఎంఎం సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఒక్క దెబ్బకు మూడు పిట్టలు..!

ద్రౌపది ముర్ము ఎంపిక వెనుక బీజేపీ మాస్టర్ ప్లాన్ కనిపిస్తోంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టల కాలం కాదిది అంటూ.. ఒక్క దెబ్బకు మూడు పిట్టలను కొట్టాలని గట్టి వ్యూహాన్ని అమలు చేస్తోంది బీజేపీ. గిరిజనుల్లో ఆమె పట్ల ఉన్న అభిమానం, ఇమేజ్‌ను గట్టిగానే వాడుకోవాలని చూస్తోంది బీజేపీ. 2017లో జార్ఖండ్‌లో భూమి కౌలు చట్టాలను సవరించాలనే బీజేపీ ప్రభుత్వ ప్రణాళికలను ముర్ము తిరస్కరించారు. ఛోటానాగ్‌పూర్ టెనెన్సీ(సీఎన్‌టీ) చట్టం, సంతాల్ పరగణ అద్దె(ఎస్‌పిటి) చట్టాన్ని సవరించడానికి ప్రవేశపెట్టిన బిల్లులను సైతం ఆమె తిరిగి పంపించారు. బీజేపీ నాయకురాలు అయిన ముర్ము.. ఆ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లులను వ్యతిరేకించడం ప్రజల్లో ఆమె పట్ల క్రేజ్‌ను, అభిమానాన్ని పెంచాయి. ఈ నిర్ణయాలు ద్రౌపది ముర్ము ను బలమైన నాయకురాలిగా ప్రజల్లో గుర్తింపు తెచ్చాయి.

కాగా, ముర్ము ను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం ద్వారా ప్రజల్లో సానుభూతిని పొందాలని, ఏక కాలంలో ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రంల్లో తమ బలాన్ని పెంచుకోవాలని బీజేపీ తలపిస్తోంది. అదే సమయంలో జార్ఖండ్‌కు చెందిన ముర్మును రాష్ట్రపతిగా ఎంపిక చేయడం ద్వారా ఒడిశాలో అధికారంలో ఉన్న బీజేడీ మద్ధతు పొందడం, అదే సమయంలో గిరిజన ప్రాతినిధ్యం అధికంగా ఉన్న జార్ఖండ్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం ద్వారా రాష్ట్రపతిగా ముర్ము విజయాన్ని సునాయాసం చేసేలా ప్లాన్ వేసింది.

ఉపరాష్ట్రపతి వెంకయ్యను కలిసిన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము..

Venkaiah Naidu

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ని ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో ఉన్న ద్రౌపది ముర్ము.. ఉపరాష్ట్రపతి నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. అంతకు ముందు.. ప్రధాని మోదీ, ద్రౌపది ముర్మును కలిశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!