Viral: మహిళ తాకగానే స్పృహ కోల్పోతున్న పూజారి.. ఆస్పత్రిలో నర్సు తాకినా అంతే.. ఏంటీ మిస్టరీ..
అసలు ఈ పూజారి సమస్య ఏంటో తేల్చాలని..స్థానికంగా ఉన్న సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లారు కొందరు భక్తులు. జేపీ ఆసుపత్రి సైకియాట్రిస్ట్ డా.ఆర్.కె.బైరాగి అతడిని పరీక్షించారు. వివిధ రకాలు టెస్టులు చేశారు. అయితే...
Trending: ఇదో మిస్టరీ కేసు… మహిళ స్పర్శ తగిలితే చాలు.. మూర్ఛపోతున్నాడు ఈ పూజారి. అందుకే ఆలయానికి వచ్చిన మహిళలను దగ్గరికి కూడా రానివ్వడం లేదు. దూరం నుంచే హారతి ఇస్తున్నాడు. మహిళలు కాస్త దగ్గరిగా వస్తే చాలు తెగ భయపడిపోతున్నాడు. మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని భోపాల్(Bhopal)లో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. అయితే మహిళలు.. టచ్ చేస్తే కళ్లు తిరిగి పడిపోవడానికి కారణం కూడా ఆ పూజారే చెప్పేస్తున్నాడు. తాను ఆంజనేయుడిని వీపరీతంగా ఆరాధిస్తానని.. అందుకే ఇలా జరుగుతుందని చెప్పుకొచ్చాడు. అసలు ఈ పూజారి సమస్య ఏంటో తేల్చాలని..స్థానికంగా ఉన్న సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లారు కొందరు భక్తులు. జేపీ ఆసుపత్రి సైకియాట్రిస్ట్ డా.ఆర్.కె.బైరాగి అతడిని పరీక్షించారు. వివిధ రకాలు టెస్టులు చేశారు. అయితే రిపోర్ట్స్ అన్నింటిలోనూ నార్మల్ అనే వచ్చింది. దీంతో డాక్టర్ కూడా కాస్త దీర్ఘంగా ఆలోచించారు. అనంతరం ఆ పూజారికి ఓ టెస్ట్ పెట్టారు. ‘లేడీ నర్సు నిన్ను తాకుతుంది. నువ్వు స్పృహా కోల్పోతావో లేదో మేము చూస్తాం’ అని పూజారితో చెప్పారు డాక్టర్. కానీ మహిళా నర్సుతో కాకుండా, అక్కడే పని చేస్తున్న ఓ వ్యక్తితో తాకమని చెప్పాడు డాక్టర్. అది తెలియని ఆ పూజారి మాత్రం స్పృహ తప్పి పడిపోయాడు. తిరిగి తేరుకున్నాక డాక్టర్ జరిగినదంతా చెప్పాడు. ఆపై అతను మానసిక రుగ్నతతో బాధపడుతున్నట్లు గుర్తించిన డాక్టర్.. ఆ మేరకు చికిత్స ప్రారంభించారు.
పూజారికి కొద్దిరోజులుగా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కొన్ని మందులు కూడా ఇచ్చారు. ఇలాంటి స్థితి ఉన్నవారిని సైకోపత్ అని అనొచ్చని, వీరికి వైద్యంతో పాటు కౌన్సిలింగ్ అందిస్తే సరిపోతుందని డాక్టర్ బైరాగి చెప్పారు. ‘కొందరు తమను తాము సూపర్ హీరోలుగా.. దేవుళ్లుగా భావిస్తున్నారు. ఇంకొందరు తమకు అతీత శక్తులున్నట్లు ఫీల్ అవుతుంటారు. ఫలానా విషయం గురించి అతిగా ఆలోచించడం వల్ల ఇలా జరుగుతుంది. ఈ పూజారి కూడా తనలో భగవంతుడి శక్తి ఉందని భావిస్తున్నాడు. అందుకే ఇలా చేస్తున్నాడు’ అని డా.ఆర్.కె. బైరాగి తెలిపారు.