Puppy Prank Video: యజమానినే భయపెట్టిన కుక్క పిల్ల.! నవ్వులు పూయిస్తున్న వీడియో..
కుక్కలు మానవులకు మంచి స్నేహితులు అనడంలో సందేహం లేదు. తమ యజమానులతో ఆటలు ఆడుతున్న కుక్కల వీడియోలు చాలా నెట్టింట్లో దర్శనమిస్తూనే ఉంటాయి.
కుక్కలు మానవులకు మంచి స్నేహితులు అనడంలో సందేహం లేదు. తమ యజమానులతో ఆటలు ఆడుతున్న కుక్కల వీడియోలు చాలా నెట్టింట్లో దర్శనమిస్తూనే ఉంటాయి. తాజాగా ఓ పప్పీ తన యజమానితో ఆడుకున్న వీడియో వైరలవుతోంది. ఆ కుక్కపిల్ల తన యజమానితో దాగుడుమూతలు ఆడి, ఆట పట్టించింది. రెండు అందమైన కుక్కలు మేడ మీద నుంచి కిందకు దిగిరావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇంతలో తమ యజమాని మెట్లు ఎక్కి.. పైకి రావడం ఆ కుక్కలు చూశాయి. అందులో ఒక చిలిపి కుక్క వెంటనే.. గోడ వెనుక దాక్కుని తమ యజమాని వచ్చే వరకు వేచి ఉంది. తమ యజమాని మెట్లు ఎక్కి.. ముందుకు రాగానే, కుక్క ఒక్కసారిగా బయటకు వచ్చి యజమానిని భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఆ తర్వాత కుక్క కాసేపు ఆగి దాని యజమాని ఏమి చేస్తాడో అంటూ వేచి ఉంది. కొన్ని సెకన్ల తర్వాత ఇద్దరూ సరదాగా ఆడుకోవడం మొదలుపెట్టారు. ఈ ఫన్నీ సీన్ ప్రతి ఒక్కరిని నవ్విస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..