Health: మల్బరీ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు… అందం, ఆరోగ్యం రెండింతో పాటు..

పట్టుపురుగుల పెంపకంలో మల్బరీ ఆకు ప్రాధాన్యం. దీనికోసం మల్బరి చెట్లు పెంచుతారు. మల్బరీ ఎరుపు, తెలుపు రంగుల్లో ఉంటుంది. మల్బరీ చెట్టు కాయలు ఎంతో రుచిగా ఉంటాయి. పులుపు, తీపీ రుచులతో జ్యూసీగా ఉండే ఈ కాయలను..

Health: మల్బరీ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు... అందం, ఆరోగ్యం రెండింతో పాటు..
Mulberry
Follow us

|

Updated on: Jun 23, 2022 | 12:28 PM

పట్టుపురుగుల పెంపకంలో మల్బరీ ఆకు ప్రాధాన్యం. దీనికోసం మల్బరి చెట్లు పెంచుతారు. మల్బరీ ఎరుపు, తెలుపు రంగుల్లో ఉంటుంది. మల్బరీ చెట్టు కాయలు ఎంతో రుచిగా ఉంటాయి. పులుపు, తీపీ రుచులతో జ్యూసీగా ఉండే ఈ కాయలను తినేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. షర్బత్ లు, స్వ్కాష్ లు, జెల్లీలు, సలాడ్స్ వంటి వాటిలో ఉపయోగిస్తారు. ఈ పండ్లలో అనేక ఔషద గుణాలు ఉన్నాయి. చైనాలో సాంప్రదాయ మూలికా వైద్యంలో గుండె జబ్బులు, మధుమేహం, రక్తహీనత, ఆర్థరైటిస్ చికిత్సలకు మల్బరీలను కొన్ని ఏళ్లగా వాడుతున్నారట. మల్బరీ తినడం వల్ల డయాబెటిస్‌తో పాటు ఎన్నో వ్యాధులు నయమవుతాయని నమ్ముతారు. అందుకే మల్బరిని పోషకాల గని అని కూడా అంటారు.

మల్బరీ కాయల్లో అనేక పోషకాలతోపాటు ఔషధగుణాలు ఉన్నాయి. మల్బరీ కాయల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లూ, ఫ్లెవనాయిడ్లూ, ఆల్కలాయిడ్లూ , ఫినాలిక్ ఆమ్లాలూ, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, కాల్షియం, విటమిన్ ఇ, కె, ఏ లు ఉన్నాయి. విటమిన్ సి ఎక్కువగా ఉండంటంతో శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బ్యాక్టీరియా ఇన్ ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది. విటమిన్ A సమృద్దిగా ఉండుట వలన కంటికి సంబందించిన సమస్యలు ఉండవు. వయస్సు పెరిగే కొద్ది వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. చర్మం మీద ముడతలను తగ్గించి యవ్వనంగా ఉండేలా చేస్తుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. రోగనిరోధక శక్తికిని పెంపొందిస్తుంది.

మల్బరీ పండ్లలో ఉండే డైటరీ ఫైబర్ హెపాటిక్ లిపోజెనిసిస్ ను నిరోధిస్తుంది. కొలెస్ట్రాల్ స్ధాయిలను నిరోధించటంలో ఈ పండ్లు ఉపకరిస్తాయి. మల్బరీని ఆహారంలో చేర్చుకోవటం ద్వారా రక్తంలో గ్లూకోజ్ స్ధాయిలు తగ్గుతాయని చెబుతున్నారు. డయాబెటిస్ వల్ల వచ్చే బరువును నియంత్రించటంలో మల్బరీ ఉపయోగపడుతుంది. జీర్ణవ్యవస్ధ మెరుగుపరిచేందుకు అద్భుతంగా పనిచేస్తాయి..మలబద్దకం, ఉబ్బరం, గ్యాస్, తిమ్మిరి వంటి వాటిని నివారిస్తాయి.. మల్బరీ పండ్లలో ఐరన్ సమృద్దిగా ఉండుట వలన ఎర్రరక్త కణాల పెరుగుదలకు దోహదం చేయటమే కాకుండా శరీర కణాలకు వేగంగా ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

ఇవి కూడా చదవండి