Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీదమీదకొచ్చిన మొసలి.. దోస పెనంతో ఒక్కటిచ్చాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో చూసేయండి..

మొసలికి నీటిలో అమితమైన బలం ఉంటుంది. నీళ్లలో ఉన్నప్పుడు మొసలి బలం లెక్కకట్టలేనిది..భారీ ఎనుగును కూడా అది ఈడ్చి పడేస్తుందంటారు. అందుకే నీటిలో ఉండే వేటాడి ఆహారం తింటుంది. నేల మీద మొసలి జీవించలగలదు

మీదమీదకొచ్చిన మొసలి..  దోస పెనంతో ఒక్కటిచ్చాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో చూసేయండి..
Crocodile
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 23, 2022 | 11:47 AM

మొసలికి నీటిలో అమితమైన బలం ఉంటుంది. నీళ్లలో ఉన్నప్పుడు మొసలి బలం లెక్కకట్టలేనిది..భారీ ఎనుగును కూడా అది ఈడ్చి పడేస్తుందంటారు. అందుకే నీటిలో ఉండే వేటాడి ఆహారం తింటుంది. నేల మీద మొసలి జీవించలగలదు కానీ బలం అంతగా ఉండదు. అయితే నదిలో ఉన్న మొసలి ఒడ్డున ఉన్న వృద్ధుడిని చూసి తినేయాలని ఆశపడింది. వెంటనే ఒడ్డుకు పరిగెత్తుకుంటూ దూసుకొచ్చింది. కానీ, పాపం ఆ వృద్ధుడు ఇచ్చిన షాక్‌తో దానికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడినట్టయింది…ఇంతకీ ఏం జరిగిందంటే.. . అది ఆస్ట్రేలియా ఉత్తర ప్రాంతం.. సాధారణంగా ఇక్కడ మొసళ్లు ఎక్కువగా తిరుగుతుంటాయి. ఇక ఇక్కడి ఓ లేక్ ప్రాంతంలో విహారయాత్రకు వెళ్లాడు ఓ వృద్ధుడు. ఏదో ఫ్రై చేసుకుందామని పెనం పట్టుకుని అటూ ఇటూ తిరుగుతున్నాడు. అయితే, అంతలోనే హఠాత్తుగా ఓ మొసలి చెరువు నుంచి బయటకొచ్చింది. వేగంగా వృద్ధుడి మీదకు దూసుకొచ్చింది. అది వస్తున్న విషయం గమనించిన ఆ వృద్ధుడు ఏ మాత్రం తడబడలేదు. తన దగ్గర ఉన్న పెనంతో తిరగబడ్డాడు. పెనంతో మొసలి మూతి మీద గట్టిగా ఒక్కటిచ్చాడు. అలా పెనం దెబ్బ మూతి మీద పడగానే మొసలి మూతిముడుచుని తోక ముడిచింది. ఎందుకొచ్చిన కర్మరా బాబు అన్నట్టుగా భయపడిపోయింది. వెంటనే వెనక్కి తిరిగి చెరువులోకి వెళ్లిపోయింది.

ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతోంది. పెద్దాయన చూపించిన ధైర్య సాహసాలకు నెటిజన్లు పొగడ్తల కామెంట్లు కుమ్మరిస్తున్నారు. అతడి ధైర్యానికి హ్యాట్సాప్‌ చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి