తల్లి మ‌ర‌ణం త‌ట్టుకోలేక పురుగుల మందుతాగిన ఇద్దరు అన్నదమ్ములు.. సూసైడ్ నోట్ కలకలం

తల్లి మ‌ర‌ణం త‌ట్టుకోలేక పురుగుల మందుతాగిన ఇద్దరు అన్నదమ్ములు.. సూసైడ్ నోట్ కలకలం
Brothers

నవ మాసాలు మోసి కనిపెంచిన అమ్మంటే వారికి అంతులేని ప్రేమ. ఆ తల్లికి దూరమై ఉండలేకపోయారు. అమ్మలేని ఈ లోకంలో మాకు ఇంకెవరూ లేరని భావించారు. అనారోగ్యంతో కన్నుమూసిన అమ్మను మర్చిపోయి ఉండలేక పోయారు.

Jyothi Gadda

|

Jun 23, 2022 | 9:57 AM

నవ మాసాలు మోసి కనిపెంచిన అమ్మంటే వారికి అంతులేని ప్రేమ. ఆ తల్లికి దూరమై ఉండలేకపోయారు. అమ్మలేని ఈ లోకంలో మాకు ఇంకెవరూ లేరని భావించారు. అనారోగ్యంతో కన్నుమూసిన అమ్మను మర్చిపోయి ఉండలేక పోయారు. ఆమెనే తలచుకుంటూ ప్రతిరోజూ విలపించారు. తల్లిలేని బాధను తట్టుకోలేక పోయిన ఆ కుమారులిద్దరూ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. కన్నతల్లి కాలం చేసిన ఆరునెల్లల్లోనే అన్నదమ్ములిద్దరూ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఈ విషాద ఘటన మేడ్చల్‌ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జ‌రిగింది. అమ్మ ప్రేమ లేదని తమ చావుకు ఎవరూ కారణం కాద‌ని సూసైడ్ నోట్ రాసి ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. దాయరా రాంపల్లి గ్రామానికి చెందిన యాదిరెడ్డి (34), మహిపాల్ రెడ్డి (29) ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. యాదిరెడ్డి అతని తమ్ముడు మహిపాల్ రెడ్డి గత 9 నెలల క్రితం వారి తల్లి ప్రమిలా అనారోగ్యంతో మృతి చెందింది.

ఇవి కూడా చదవండి

ఇది తట్టుకోలేని కొడుకులు కూడా త‌మ జీవితం చాలు అనుకున్నారు. చివరకు పెద్ద కొడుకు యాదిరెడ్డి సూసైడ్ నోట్ రాసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తమ్ముడు మహిపాల్ రెడ్డి పురుగుల మందు తాగి చ‌నిపోయాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu