Covid News: అక్కడ మరోమారు కరోనా విజృంభణ.. నిన్న ఒక్క రోజే 50 వేల కేసులు..

మరోసారి ప్రపంచ దేశాలను కరోనా రక్కసి భయాందోళనకు గురి చేస్తోంది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లలో మళ్లీ మాస్కులు తప్పనిసరి చేయాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఈ కొత్త వేవ్‌ ఎంత తీవ్రతతో వుండబోతుందనేది భయాందోళన కలిగిస్తుందన్నారు ..

Covid News: అక్కడ మరోమారు కరోనా విజృంభణ.. నిన్న ఒక్క రోజే 50 వేల కేసులు..
France Is Facing A New Covi
Follow us

|

Updated on: Jun 23, 2022 | 12:31 PM

మరోసారి ప్రపంచ దేశాలను కరోనా రక్కసి భయాందోళనకు గురి చేస్తోంది. మళ్లీ కరోనా విజృంభన కొనసాగుతుండడంతో భారీగా కేసులు నమోదువుతున్నాయి. కరోనా పుట్టినిల్లు చైనాలో కూడా ఇటీవల కోవిడ్‌ కేసులు పెరగడంతో.. కఠిన లాక్‌డౌన్‌ నిబంధనలు అమలు చేసి.. కరోనాను కట్టడి చేశారు. అయితే..ఇప్పుడు ఫ్రాన్స్ దేశం కొత్త కరోనా వేవ్‌ని ఎదుర్కొంటోందని ఆ దేశ వ్యాక్సినేషన్ చీఫ్ అలెన్ పిషర్ పేర్కొన్నారు. స్థానిక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కోవిడ్‌ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్‌లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నట్లు తెలిపారు అలెన్ పిషర్. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లలో మళ్లీ మాస్కులు తప్పనిసరి చేయాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఈ కొత్త వేవ్‌ ఎంత తీవ్రతతో వుండబోతుందనేది భయాందోళన కలిగిస్తుందన్నారు అలెన్ పిషర్.

మరోవైపు పోర్చుగల్‌లో కూడా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా తలెత్తిన ఒమిక్రాన్‌ వేరియంట్లు బిఎ.4, బిఎ.5ల వల్లే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని యురోపియన్‌ అంటువ్యాధుల నివారణా కేంద్రం (ఇసిడిసి) పేర్కొంది. అయితే ఈ వేరియంట్ల వల్ల ఒమిక్రాన్‌ ఇతర వేరియంట్ల మాదిరిగా తీవ్ర ముప్పు వంటి సమస్యలు తలెత్తుతున్నట్లు కనిపించడం లేదని పేర్కొంది. ఫ్రాన్స్‌లో మే చివరి నాటికి కొత్త ఇన్ఫెక్షన్లు నెమ్మదిగానే అయినా పెరుగుతునే వచ్చాయి. మే 27న 17,705 కేసులు వుండగా, జూన్‌ 21నాటికి 50,402 కేసులు నమోదయ్యాయి. అయితే గత మూడు రోజుల్లో 458 పెరిగి 14,334కి చేరుకుంది. ఇది దాదాపు మూడు వారాల గరిష్టం. ఫ్రాన్స్‌లో మంగళవారం 24 గంటల్లో కోవిడ్-19 మరణాల సంఖ్య 56 కు పెరిగి 149,162కి చేరుకుంది.