Covid-19: కరోనా అలర్ట్.. వ్యాక్సినేషన్, టెస్ట్‌లను పెంచండి.. కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవియా
భారతదేశంలో కోవిడ్-19 కేసుల పెరుగుదల దృష్ట్యా, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా గురువారం దేశంలో కోవిడ్ కేసులు, వ్యాక్సినేషన్ పరిస్థితిని సమీక్షించారు.
Mansukh Mandaviya – Coronavirus: దేశంలో కరోనా పీడ వదలడం లేదు. థర్డ్ వేవ్ అనతరం పోయిందనుకున్న మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఇటీవల కేసుల సంఖ్య పదివేలకు పైగా నమోదవుతోంది. కేసులు, పాజిటివిటీ రేటు పెరిగిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్తలపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా వైద్యాధికారులతో సమావేశమయ్యారు కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి మన్సుఖ్ మాండవియా. భారతదేశంలో కోవిడ్-19 కేసుల పెరుగుదల దృష్ట్యా, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా గురువారం దేశంలో కోవిడ్ కేసులు, వ్యాక్సినేషన్ పరిస్థితిని సమీక్షించారు. కీలక నిపుణులు, అధికారులతో కేంద్ర మంత్రి సమావేశమయ్యారు. కోవిడ్ నియంత్రణకు వృద్ధులకు, పిల్లలకు టీకాలు వేయాలని సూచించారు. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాలపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. RT-PCR టెస్ట్‌ల సంఖ్య పెంచాలని.. జీనోమ్ సీక్వెన్సింగ్ జరపాలని రాష్ట్రాలకు ఆదేశించారు. అలాగే వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయాలని కేంద్రమంత్రి సూచించారు. అధిక కేసులు నమోదయ్యే జిల్లాల్లో బూస్టర్ డోస్‌లతో సహా టీకాల వేగాన్ని పెంచాలని మన్సుఖ్ మాండవియా సూచించారు. ఏదైనా మ్యూటేషన్ వ్యాప్తి చెందే అవకాశం ఉందేమో పరిశీలించాలని.. రాష్ట్రాల వారీగా నివేదిక అందజేయాలని ఆదేశించారు.
కాగా.. దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా గురువారం 13,313 కేసులు నమోదవగా..38మంది మృతి చెందారు. రోజురోజుకీ పాజిటివిటీ రేటు పెరిగిపోతోంది. నిన్నటికంటే ఇవాళ 8.7శాతం మేర పెరిగాయి కొవిడ్ కేసులు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 83,990కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 2వేలకు చేరువలో ఉన్నాయి రోజువారీ కేసులు. కొత్తగా 1934మంది కరోనా బారిన పడ్డారు. అక్కడ యాక్టివ్ కేసుల సంఖ్య 5755కి చేరింది. ఇక తెలంగాణలో 5వందలకు చేరువలో ఉన్నాయి కేసులు. కొత్తగా 494మందికి వైరస్ సోకింది. వాటిలో హైదరాబాద్‌లోనే 315 కేసులు ఉన్నాయి.
గత రెండు వారాలుగా భారతదేశంలో అత్యధిక సంఖ్యలో COVID-19 కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో రోజుకు 1,000 కేసులు నమోదవుతున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..