CM Jagan: జగన్‌ పారిస్‌ పర్యటనకు లైన్‌ క్లియర్‌.. షరతులతో అనుమతినిచ్చిన సీబీఐ కోర్టు..

CM Jagan Paris Tour: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై ఎస్‌ జగన్‌ (CM Jagan) పారిస్‌ పర్యటనకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. ఈనెల 28 నుంచి 10 రోజుల పాటు పారిస్‌ వెళ్లేందుకు సీఎంకు సీబీఐ న్యాయస్థానం అనుమతినిచ్చింది. కాగా అక్రమాస్తులు కూడబెట్టారన్న ...

CM Jagan: జగన్‌ పారిస్‌ పర్యటనకు లైన్‌ క్లియర్‌.. షరతులతో అనుమతినిచ్చిన సీబీఐ కోర్టు..
Cm Jagan
Follow us

|

Updated on: Jun 23, 2022 | 8:21 PM

CM Jagan Paris Tour: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై ఎస్‌ జగన్‌ (CM Jagan) పారిస్‌ పర్యటనకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. ఈనెల 28 నుంచి 10 రోజుల పాటు పారిస్‌ వెళ్లేందుకు సీఎంకు సీబీఐ న్యాయస్థానం అనుమతినిచ్చింది. కాగా అక్రమాస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు ఎదుర్కొంటోన్న జగన్‌.. విదేశీ పర్యటనలతో కేసుల విచారణలో జాప్యం అవుతుందని సీబీఐ చేసిన అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే వీటిని సీబీఐ న్యాయస్థానం తోసిపుచ్చింది. పర్యటన వివరాలను సీబీఐకి, కోర్టుకు సమర్పించి వెళ్లాల్సిందిగా జగన్‌ను కోర్టు ఆదేశించింది.

సీఎం జగన్‌ పెద్ద కుమార్తె హర్షారెడ్డి పారిస్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేస్తున్నారు. పారిస్‌లోని ఇన్సీడ్‌ బిజినెస్‌ స్కూల్లో చదువుతున్న ఆమె జులై 2న కాన్వొకేషన్‌ తీసుకోనున్నారు. కుమార్తె కాన్వొకేషన్‌ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అనుమతివ్వాలని సీఎం జగన్‌ సీబీఐ కోర్టును అభ్యర్థించారు. కుమార్తె కళాశాల స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు వీలుగా.. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్‌ షరతులను సడలించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈనెల 28 నుంచి వారం పాటు వెళ్లేలా అనుమతి ఇవ్వాలని జగన్‌ సీబీఐ కోర్టును విన్నవించారు. అయితే కేసులు విచారణలో ఉండగా విదేశీ పర్యటనలకు వెళితే జాప్యం జరుగుతుందని జగన్‌ పారిస్‌ పర్యటనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కౌంటర్‌ దాఖలు చేశారు సీబీఐ అధికారులు. అయితే రెండు వైపులా వాదనలు విన్న న్యాయస్థానం తాజాగా పారిస్‌ పర్యటనకు జగన్‌కు పర్మిషన్‌ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..