NTR District: రోడ్డు పక్కన కంపల్లో కనిపించినవి చూసి స్థానికులు షాక్.. మరీ దేవుడి ప్రసాదం కూడానా..

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం బట్టబయలైంది. రోడ్డు పక్కన కుప్పలు తెప్పులుగా ఆధార్ కార్డ్స్ కనిపించడంతో.. ఏంటా అని స్థానికులు పరిశీలించగా.. అసలు విషయం తెలిసింది.

NTR District: రోడ్డు పక్కన కంపల్లో కనిపించినవి చూసి స్థానికులు షాక్.. మరీ దేవుడి ప్రసాదం కూడానా..
Postal Department Negligence
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 23, 2022 | 5:27 PM

AP News: పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ నిర్ల్యక్షానికి సాక్ష్యంగా ఆధార్‌ కార్డులు, ప్రసాదాలు చెత్తకుప్పల్లో కనిపించాయి. ఎవరికైనా చాలా ముఖ్యమైన ఐడెంటిటీ కార్డ్‌ ఆధార్‌. అలాగే దేవుడి ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తాం. కానీ అవి తపాలా శాఖ నిర్లక్ష్యంతో చేరాల్సిన చిరునామాకు కాకుండా చెత్తకుప్పల్లోకి చేరాయి. ఆధార్‌ కార్డులు, దేవాలయాల ప్రసాదాలే కాదు పెళ్ళి శుభలేఖలు, నిరుద్యోగులు ఆర్డర్ పెట్టుకున్న స్టడీ మెటీరియల్స్, వివిధ శాఖల నోటీసులను కూడా చెత్తలో వేశారు పోస్టల్‌ సిబ్బంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట(jaggaiahpet) నియోజకవర్గంలో ఈ సీన్‌ కనిపించింది. స్థానిక పోస్టల్ సిబ్బంది ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నారో కళ్లకు కట్టింది. తొర్రగుంటపాలెం(Torraguntapalem) RTO ఆఫీస్‌ వెనుక చెత్త కుప్పల్లోనే ప్రజలకు చేరాల్సిన ఆధార్, వెడ్డింగ్‌ కార్డులు, వివిధ శాఖలు జారీ చేసిన నోటీసులు, భక్తుల కోరిక మేరకు దేవస్థానాలు తపాలా ద్వారా పంపిన దేవుడి ప్రసాదాలు కనిపించాయి. వీటిని గమ్యానికి చేర్చాల్సిన బాధ్యతను గాలికొదిలేసిన పోస్టల్‌ శాఖ చెత్త కుప్పలో వేసి చేతులు దులిపేసుకుంది. పోస్టల్‌ ఉద్యోగుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిజిస్టర్ పోస్టులకు ప్రత్యేకంగా డబ్బులు వసూలు చేసే పోస్టల్ శాఖ ప్రజలకు అందాల్సిన వస్తువులను ముళ్లకంపల్లో పడేయడం ఏంటని  నిలదీస్తున్నారు. అధికారులు స్పందించి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి