AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nandyal District: ఆ జిల్లాకు ఉయ్యాలవాడ పేరు పెట్టండి.. ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు..

Uyyalawada District: నంద్యాల జిల్లాకు ఉయ్యాలవాడ పేరు పెట్టడం పై హైకోర్టులో పిల్ దాఖలైంది. హైకోర్టులో తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పిల్ దాఖలు చేశారు.

Nandyal District: ఆ జిల్లాకు ఉయ్యాలవాడ పేరు పెట్టండి.. ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు..
Ap High Court
Sanjay Kasula
|

Updated on: Jun 23, 2022 | 6:23 PM

Share

ఏపీ కొత్త జిల్లాలు.. కొత్త పేర్లపై రచ్చ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ భాగంగా పాత కర్నూలు జిల్లాలో కొంత భూభాగంతో కొత్తగా నంద్యాల జిల్లా ఏర్పడింది. అయితే ఇప్పుడు ఆ జిల్లాకు నంద్యాల అని కాకుండా మరోపేరు పెట్టాలనే డిమాండ్ తెరమీదికి వచ్చింది. ఇదే జిల్లాలో జన్మించిన  ప్రథమ తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలని డిమాండ్ మొదలు పెట్టారు. అయితే తాజాగా నంద్యాల జిల్లాకు ఉయ్యాలవాడ పేరు పెట్టడం పై హైకోర్టులో పిల్ దాఖలైంది. హైకోర్టులో తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పిల్ దాఖలు చేశారు. దీంతో మరోసారి జిల్లా పేర్లపై చర్చ మొదలైంది. ప్రథమ తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నంద్యాల జిల్లాలో జన్మించారు. అందుకే నంద్యాల జిల్లాకు ఆయన పేరు నామకరణం చేయాలని విజ్ఞప్తి చేశారు.

రాయలసీమలో బ్రిటిష్ వారిని ఎదిరించిన వీరుడు ఉయ్యాలవాడ అని పేర్కొన్న పిటీషనర్. స్వాతంత్ర్యం కోసం పోరాడిన మొదటి వీరుడు కాబట్టి ఆయనకు గుర్తింపు నిచ్చేలా జిల్లా పేరు పెట్టాలన్న పిటిషనర్ కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి డిమాండ్ చేశారు. ప్రతివాదులుగా సీఎస్, రెవెన్యూ, ప్రణాళిక శాఖల కార్యదర్శులను ప్రతివాదులుగా పేర్కొన్నారు పిటిషనర్. పిటీషనర్ తరపున వాదనలు వినపించనున్న న్యాయవాదులు గుండాల శివప్రసాద్ రెడ్డి, దేవి సత్యశ్రీ.

మొట్టమొదటిగా భారత్ లో సిపాయిల తిరుగుబాటు కంటే ముందు రాయలసీమలో బ్రిటిష్ వారిని ఎదిరించిన వీరుడు,  బ్రిటిష్ వారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఉరి తీసి కోట గుమ్మంనకు 30 సంవత్సరలు వేలాడ తీయబడిన గొప్ప వీరుని పెరు నంద్యాల జిల్లాకు పెట్టడం సమంజసమని కేతిరెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కు ఇదివరలోనే అభ్యర్ధించడం జరిగిందని మా అభ్యర్థను పరిగణనలోకి తీసుకోలేదు కాబట్టి హైకోర్టు ను ఆశ్రయించటం జరిగిందని కేతిరెడ్డి కోరారు. 2017 లోనే జిల్లాలు విడిపోకముందు కర్నూలు జిల్లాకు ఉయ్యాలవాడ పెరు పెట్టాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దుష్టికి తాను తీసుకుని రావటం జరిగిందని, ఇప్పుడు కొత్త జిల్లా గా నంద్యాల ఏర్పాటు చేయటం జరిగింది కాబట్టి ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జిల్లాగా నామకరణం చేయాలని, తాను గతంలో కేంద్ర ప్రభుత్వంను , జాతీయ వీరుడు గా గుర్తించాలని, నేటి తరం బావి భారత తరాలకు తెలుయుటకు వారి జీవిత చరిత్ర ను పాఠంస్యం లో చేర్చాలని, వారి విగ్రహం ను పార్లమెంట్ నందు పెట్టాలని, వారి పేరుతో పోస్టల్ స్టాంప్ విడుదల గురించిప్రదాని మోదీని కోరడం జరిగిందని అన్నారు కేతిరెడ్డి.

ఉయ్యాలవాడ జీవిత చరిత్ర ను ఆధారం చేసుకుని చిరంజీవి “”సైరా”” పేరుతో చలనచిత్ర ను కూడా తీసి ,విడుదల కూడా చేయటం జరిగిందని ఆ పిటిషన్ లో తెలియచేస్తూ ఉయ్యాలవాడ చరిత్ర ను కూడా తెలిపారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం రూపనగుడి గ్రామంలో జన్మించారు. బ్రిటిష్ వారిపై తిరుగుబాటు అంత నంద్యాల ప్రాంతంలో జరిగింది.. నంద్యాల ప్రాంతంలోని నల్లమల అడవులను తన స్థావరం గా ఏర్పాటు చేసుకొన్నారు.. గిరిజనులు. చుంచులు 9వేల మంది సొంత సైన్యం బ్రిటిష్ వారిపై ఆ కాలం లోనే గైరిల్లా యుద్ధం చేసారు..బ్రిటీష్ వారు పన్నుల రూపం లో వసూలు చేసిన డబ్బును కొల్లకొట్టి పీధాప్రజాలకు పంచిపెట్టరు.

ఇప్పుడు జిల్లా ల విభజన లో భాగంగా కర్నూలు జిల్లా లోని కొంత భాగం ను నంద్యాల జిల్లా గా ప్రకటించట0 జరిగింది కాబట్టి ఆ మహా వీరుడు నంద్యాల ప్రాంతంలో పుట్టినారు కాబట్టి. వారి స్వాతంత్ర్య సంగ్రామం అక్కడే జరిగింది కాబట్టి. వారిని ఉరి తీసిన ప్రాంతం ప్రస్తుత నంద్యాల జిల్లాలో ఉంది. కాబట్టి వారి పెరు నంద్యాల జిల్లాకు పెట్టడం ప్రభుత్వ బాధ్యతని కేతిరెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. కొన్ని జిల్లాలకు కొందరు మహానుభావుల పెరు పుట్టినారు కాబట్టి నంద్యాల జిల్లాకు కూడా వారి పెరు పెట్టి వారికి నిజమైన నివాళి అర్పించలని వారు తమ పిటిషన్ లో కోరారు.. రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ని, రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ని ,ప్రణాళిక శాఖ కార్యదర్శి ని పార్టీలుగా చేర్చారు….

ఏపీ వార్తల కోసం