AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: టీసీఎల్‌ పరిశ్రమకు సీఎం జగన్‌ శంకుస్థాపన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

ఏర్పేడు మండలం వికృతమాలలో ఈఎంసీ–1 పరిధిలోని టీసీఎల్‌ పరిశ్రమ శంకుస్థాపన చేశారు సీఎం జగన్. రూ. 1230 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ కంపెనీని..

CM Jagan: టీసీఎల్‌ పరిశ్రమకు సీఎం జగన్‌ శంకుస్థాపన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
Cm Jagan
Sanjay Kasula
|

Updated on: Jun 23, 2022 | 4:14 PM

Share

ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం తిరుపతిలో బీజీబీజీగా ఉన్నారు. సీఎం జగన్ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ ఉదయం పునర్నిర్మించిన వకుళామాత ఆలయాన్ని ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్. అనంతరం.. శ్రీకాళహస్తి మండలం ఇనగనూరులో అపాచీ లెదర్‌ పరిశ్రమకు భూమి పూజ చేశారు సీఎం జగన్‌. 290 ఎకరాల్లో 702 కోట్లతో ఈ పరిశ్రమ పెడుతున్నారు. 10వేల మందికి ఉపాధి కల్పించాలనేది దీని లక్ష్యం. తొలి దశలో 350 కోట్లు పెట్టుబడి పెడతారు. ఈ పరిశ్రమలో లెదర్‌ షూలు, లెదర్‌ జాకెట్స్‌, బెల్ట్‌లు తయారు చేస్తారు. ఈ పరిశ్రమల్లో 80 శాతం ఉద్యోగాలు మహిళలకే వస్తాయని, స్థానికంగా ఇదో మంచి పరిణామమని చెప్పారు సీఎం జగన్‌. అపాచీ పరిశ్రమకు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించడానికి సిద్ధమని హామీనిచ్చారు ముఖ్యమంత్రి.

అపాచీ లెదర్‌ పరిశ్రమకు భూమి పూజ నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు ఏర్పేడు మండలం వికృతమాలలో ఈఎంసీ–1 పరిధిలోని టీసీఎల్‌ పరిశ్రమ శంకుస్థాపన చేశారు సీఎం జగన్. రూ. 1230 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ కంపెనీని 125 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ పరిశ్రమ ద్వారా నేరుగా 3 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రేణిగుంట విమానాశ్రయం సమీపంలో మరో ఆరు పరిశ్రమలకు సీఎం జగన్ శంకు స్థాపన చేశారు.

టీసీఎల్‌ పరిశ్రమ..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తయారీని ప్రారంభించారు. TCL గ్రూప్, డిక్సన్  ప్యానెల్ ఆప్టోడిస్ప్లే టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ (POTPL) సౌకర్యాలు, టెక్నాలజీస్, ఫాక్స్‌లింక్, సన్నీ ఓపో టెక్, మరో యూనిట్‌కు శంకుస్థాపన చేస్తారు. డిక్సన్ టెక్నాలజీస్, ఫాక్స్ లింక్ 23 జూన్ 2022న తిరుపతిలో ఎలక్ట్రానిక్స్‌కు గర్వకారణంగా మారనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలోని EMC నుంచి POTPL ఫ్యాక్టరీ (TCL ఇండియా) TV ప్యానెల్‌లను తయారు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో టీవీ ప్యానల్ తయారీ కేంద్రంను నెలకొల్పుతున్నారు.  ప్రతిపాదిత 1230 కోట్ల పెట్టుబడిలో 1040 కోట్ల మొత్తం సృష్టించబడుతుంది. 3174 మంది ఉపాధిలో 1000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఇప్పటికే యూనిట్‌లో పనిచేస్తున్నారు.

జాబితాలోని మరొక కంపెనీ సన్నీ ఓపో టెక్, ఇది ప్రపంచానికి కెమెరా మాడ్యూల్స్‌ను తయారు చేస్తుంది మొబైల్ ఫోన్ల అసెంబ్లీంగ్‌లో టాప్ కంపెనీల్లో ఒకటిగా ఈ సంస్థ ఉంది. కంపెనీ ఆస్ఫెరికల్ లెన్స్ అప్లికేషన్, ఆటో-ఫోకస్, జూమ్, MI, Samsung, Oppo, Vivo ద్వారా ఇతర ఆప్టికల్ కోర్ టెక్నాలజీలతో బహుళస్థాయిలో ఈ కంపెనీ పని చేయనుంది. ఇప్పటివరకు, సన్నీ ఒప్పోటెక్ 100 కోట్ల పెట్టుబడి పెట్టింది.

పారిశ్రామిక అనుకూలమైన వాతావరణం కారణంగా టీసీఎల్ కంపెనీ యాజమాన్యం ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకుంది. దేశంలోని ఇతర రాష్ట్రాల కంటేఅనుకూల వాతావరణం ఇక్కడ ఉందని కంపెనీ యామాన్యం అభిప్రాయ పడింది.. ప్రత్యేక్షంగా పరోక్షంగా కంపెనీ ఏర్పాటుతో ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు.  ప్యానల్ పరిశ్రమలో క్యాపిటల్-ఇంటెన్సివ్, టెక్నాలజీ-ఇంటెన్సివ్, పర్సనల్ ఇంటెన్సివ్ ఉన్నందున, మంచి మౌలిక సదుపాయాలు, అనుకూలమైన పోర్ట్‌లు,  వృత్తిపరమైన నైపుణ్యాలు కలిగిన ఇంజనీర్లు అవసరముంటుందన్నారు.

సన్నీ ఆప్కోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు..

సన్నీ ఆప్కోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. మొబైల్ ఫోన్ కెమెరా లెన్స్ తయారు చేస్తున్న సన్నీ ఆప్కోటెక్ సంస్థ. వివిధ రకాల మొబైల్ కంపెనీలకు కెమెరాల సరఫరా చేయనున్న సన్నీ అఫ్కోటెక్. సన్నీ ఆప్కొటెక్ సంస్థ ద్వారా రూ.254 కోట్లు పెట్టుబడులు పెట్టింది. ఇందులో 3 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

 ఏపీ వార్తల కోసం..