AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పెళ్లికి వెళితే.. స్నేహితుడి ప్రాణాలు తీసిన వరుడు.. ఊరేగింపులో తుపాకీతో.. వీడియో

ఉత్తర ప్రదేశ్‌ (Uttar Pradesh) లోని సోన్‌భద్ర జిల్లా బ్రహ్మనగర్‌లో సెలెబ్రెటరీ ఫైరింగ్‌కు ఓ యువకుడు బలి అయ్యాడు. పెళ్లి (Wedding) ఊరేగింపులో రథంపై ఉన్న పెళ్లికొడుకు తుపాకీతో కాల్పులు జరిపాడు.

Viral Video: పెళ్లికి వెళితే.. స్నేహితుడి ప్రాణాలు తీసిన వరుడు.. ఊరేగింపులో తుపాకీతో.. వీడియో
Viral Video
Shaik Madar Saheb
|

Updated on: Jun 24, 2022 | 6:00 AM

Share

Celebratory Firing: డేంజర్‌ అని తెలిసినా సెలెబ్రెటరీ ఫైరింగ్‌ ఆగడం లేదు. ఈ సరదా ఒక్కోసారి ప్రాణాల మీదికి తెస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో వేడుకల్లో ఫైరింగ్‌ ఆనవాయితీ కొనసాగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడంతో విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్‌ (Uttar Pradesh) లోని సోన్‌భద్ర జిల్లా బ్రహ్మనగర్‌లో సెలెబ్రెటరీ ఫైరింగ్‌కు ఓ యువకుడు బలి అయ్యాడు. పెళ్లి (Wedding) ఊరేగింపులో రథంపై ఉన్న పెళ్లికొడుకు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఆ బుల్లెట్ తగిలి కింద ఉన్న పెళ్లికొడుకు ఫ్రెండ్ బాబూలాల్ యాదవ్ కుప్పకూలిపోయాడు. బాబూలాల్‌ ఆర్మీలో జవాన్‌గా పనిచేస్తున్నాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

సెలవులు కావడంతో ఆర్మీ నుంచి వచ్చిన బాబూలాల్‌ స్నేహితుడైన మనీష్‌ మధేషియా పెళ్లికి వెళ్లాడు. మనీష్‌కు తన గన్‌ ఇచ్చాడు బాబూలాల్‌. వేడుకల్లో భాగంగా గన్‌ను గాల్లోకి కాల్చాడు మనీష్‌. మిస్‌ ఫైర్‌ అయి బుల్లెట్‌ బాబూలాల్‌కు తగిలింది. అతని టుంబ సభ్యుల ఫిర్యాదుతో మనీష్‌ను అరెస్ట్‌ చేశారు పోలీసులు. గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. లైసెన్స్ ఉన్నా సరే సెలెబ్రెటరీ ఫైరింగ్ పేరుతో కాల్పులు జరపడం నేరమేనని సోన్‌భద్ర ఎస్పీ అమరేంద్ర ప్రతాప్ సింగ్. ఓ ప్రమాదకర ఆనవాయితీకి పెళ్లికొడుకు జైలు పాలవ్వగా, అతని ఫ్రెండ్‌ ఈ లోకం నుంచే వెళ్లిపోయాడు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో.. 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..