Watch Video: ఆ దేశంలో కూడా ఆపరేషన్ బుల్డోజర్.. ఆకతాయిల దూల తీర్చిన పోలీసులు.. వీడియో
అమెరికాకు వాణిజ్య రాజధానిలాంటి న్యూయార్క్‌లో ఇలాంటి డర్టీ బైక్స్ సృష్టించే న్యూసెన్స్ మరీ ఎక్కువైంది. ముఖ్యంగా రాత్రివేళ ప్రజా భద్రతకు ప్రమాదకరంగా మారిన ఈ బైక్స్‌లపై న్యూయార్క్ పోలీసు డిపార్ట్‌మెంట్ ఉక్కుపాదం మోపింది.
Bulldozer crushes illegal dirt bikes: అమెరికాలోని చాలా నగరాల్లో డర్జీ బైక్స్ న్యూసెన్స్‌గా మారాయి. రద్దీ రోడ్ల మీద ఆకతాయీలు రోడ్డ మీద అడ్డదిడ్డంగా నడుపుతూ ఇతర వాహనదారులకు, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు.. ఏమాత్రం ట్రాఫిక్స్ రూల్స్ పాటించకుండా, వేగంగా డర్టీ బైక్స్ నడుపుతూ ప్రమాదాలకు కూడా కారణమవుతున్నారు. ఈ వాహనాల్లో చాలా వరకూ రిజిస్ట్రేషన్ చేయనివే. అంటే ఇవన్నీ చట్ట విరుద్దంగా ఎవరినీ లెక్క చేయకుండా నడుపుతున్నారన్నమాట.. అమెరికాకు వాణిజ్య రాజధానిలాంటి న్యూయార్క్‌లో ఇలాంటి డర్టీ బైక్స్ సృష్టించే న్యూసెన్స్ మరీ ఎక్కువైంది. ముఖ్యంగా రాత్రివేళ ప్రజా భద్రతకు ప్రమాదకరంగా మారిన ఈ బైక్స్‌లపై న్యూయార్క్ పోలీసు డిపార్ట్‌మెంట్ ఉక్కుపాదం మోపింది. ఈ ఇల్లీగల్ వెహికిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. చాలా బండ్లను రిజిస్టర్ చేయకుండానే తిప్పుతున్నారని గుర్తించారు. ఈ వాహనాలన్నింటినీ ఒక మైదానంలోకి చేర్చి వాటి మీద బుల్డోజర్ నడిపించి ధ్వంసం చేసేశారు..
ఈ వాహనాలను ఉపయోగించడం వల్ల న్యూయార్క్ వాసులందరికీ ప్రమాదం ఉందన్నారు న్యూయార్క్ మహానగర మేయర్ ఎరిక్ ఆడమ్స్. పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ప్రజలను భయపెడుతూ నడిపించే ఈ చట్టవిరుద్ద బైక్స్‌ను ఎవరూ భరించలేరని, అందుకే ఇలాంటి వాహనాలను స్వాధీనం చేసుకొని బుల్డోజర్‌తో క్రష్ చేస్తున్నామని తెలిపారు. గత ఏడాది జప్తు చూసిన 2 వేల వాహనాలను ఇలా బుల్డోజర్ ద్వారా ధ్వంసం చేశారు.. వీధుల్లో చట్ట విరుద్దమైన వాహనాలను నడిపేవారికి ఇదో గుణపాఠం అంటున్నారు న్యూయార్క్‌వాసులు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వైరల్ వీడియో..
Dirt bikes confiscated by the New York City Police Department were crushed under a bulldozer in Brooklyn pic.twitter.com/4c71Y3Z69B
— Reuters (@Reuters) June 22, 2022
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..