Uddhav Thackeray: క్యాంప్ ఆఫీసును ఖాళీ చేస్తున్న ఉద్దవ్ థాక్రే.. లైవ్ వీడియో..
Maharashtra Political Crisis: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే రాజీనామాకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఏక్‌నాథ్ తిరుగుబాటుతో ఉద్ధవ్ సర్కార్ మైనార్టీలో పడిపోయింది. ప్రస్తుతం అన్నిదారులూ మూసుకుపోవడంతో ఉద్ధవ్ గద్దె దిగేందుకు సిద్ధమయ్యారు. పదవిపై తనకు వ్యామోహం లేదని చెప్పిన ఉద్ధవ్ థాకరే.. సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్నారు. ఫేస్‌బుక్ లైవ్ తర్వాత.. కార్యాలయం నుంచి సామగ్రిని ఖాళీ చేసేశారు. ఈ విషయం తెలుసుకున్న కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకుని.. కార్యాలయాన్ని ఖాళీ చేయొద్దని వేడుకున్నారు. భావోద్వేగానికి గురైన పలువురు కార్యకర్తలు కంటతడి పెట్టుకున్నారు.
Published on: Jun 22, 2022 10:23 PM
Latest Videos
వైరల్ వీడియోలు