Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banking Fraud: ఒకటీ రెండు కాదు.. ఏకంగా రూ. 35వేల కోట్లు ఆంఫట్.. దేశంలో అతిపెద్ద బ్యాంక్ స్కామ్‌..

DHFL case: దిమ్మతిరిగిపోయే స్కాం ఇది. దేశ చరిత్ర చూడని భారీ కుంభకోణం ఇది. 35 వేల కోట్లమేర ఎగ్గొట్టిన స్కామ్‌ రంగా స్టోరీ ఇది.

Banking Fraud: ఒకటీ రెండు కాదు.. ఏకంగా రూ. 35వేల కోట్లు ఆంఫట్.. దేశంలో అతిపెద్ద బ్యాంక్ స్కామ్‌..
DHFL Banking Fraud
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 22, 2022 | 8:17 PM

దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌ స్కాం ఇది. ఒకటీ రెండు కాదు.. ఏకంగా రూ. 35వేల కోట్ల స్కాం. ఇన్నిరోజులు ఆధారాల కోసం ఎదురు చూసిన సీబీఐ… ఇప్పుడు పక్కా ఆధారాలతో కేసు నమోదు చేసింది. DHFL ఫైనాన్స్‌ కంపెనీ మాజీ ప్రమోటర్లపై సీబీఐ కేసు పెట్టింది. కంపెనీ ప్రమోటర్లు కపిల్‌ వాధ్వాన్‌, దీరజ్‌ వాధ్వాన్‌పై అభియోగాలు నమోదయ్యాయి. యూనియన్‌ బ్యాంక్‌ నేతృత్వంలోని కన్షార్షియాన్నిరూ. 34,615 కోట్ల మేర మోసగించించారన్న అభియోగాలపై ఈ కేసు నమోదు చేసింది సీబీఐ. బ్యాంకులను మోసగించిన వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసుల్లో.. ఇదే అతిపెద్ద మోసంగా నిలిచింది. ఇప్పటివరకు ఏబీజీ షిప్‌యార్డ్స్‌ కంపెనీ 22వేల కోట్ల మేర చేసిన మోసమే అతిపెద్దది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కేసులో ముంబయిలోని 12 చోట్ల సోదాలు నిర్వహించినట్లు సీబీఐ అధికారులు ప్రకటించారు.

50 మంది అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. సోదాల అనంతరం డీహెచ్‌ఎఫ్‌ఎల్‌తో పాటు, కపిల్‌, దీరజ్‌ వాధ్వాన్‌తో పాటు అమరిల్లీస్‌ రియల్టర్స్‌కు చెందిన సుధాకర్‌ శెట్టి, మరో ఆరుగురు బిల్డర్లపై కేసు నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. బ్యాంకు కన్షార్షియం 2010 నుంచి 2018 మధ్య రూ. 42,871 కోట్ల మేర రుణాలు సమకూర్చినట్లు యూనియన్‌ బ్యాంక్‌ తెలిపింది.

2019 నుంచి తిరిగి చెల్లింపులు నిలిచిపోయినట్లు సీబీఐకి 2021లో ఆ బ్యాంక్‌ లేఖ రాసింది. తాము కేపీఎంజీ అనే సంస్థతో ఆడిట్‌ నిర్వహించినప్పుడు ఈ స్కాం బయటికొచ్చినట్లు యూనియన్‌ బ్యాంక్‌ వెల్లడించిది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ నిబంధనల ఉల్లంఘనతో పాటు ఆర్థిక అవకతవకలు, నిధుల మళ్లింపు వంటి చర్యలకు పాల్పడినట్లు గుర్తించామంది యూనియన్‌ బ్యాంక్‌. ఈ ఏడాది ఫిబ్రవరి 11న సీబీఐకి ఫిర్యాదు చేసింది.

ఇవి కూడా చదవండి

దీనిపై సీబీఐ ఇప్పసుడు తనిఖీలు నిర్వహించి కేసు నమోదు చేసింది. మరోవైపు యెస్‌ బ్యాంక్‌ వ్యవహారంలో ఇప్పటికే డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ మాజీ ప్రమోటర్లు ఇద్దరూ జైల్లో ఉన్నారు. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ను గతేడాది పిరమాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కొనుగోలు చేసింది.

బిజినెస్ వార్తల కోసం