Viral Video: యుద్ధం మా ప్రేమను విడదీయలేదు.. సైనిక దుస్తుల్లోనే ఒక్కటైన ఉక్రెయిన్‌ జంట.. వీడియో

యుద్ధ వాతావరణ పరిస్థితుల్లోనే ఓ ప్రేమ జంట సైనిక దుస్తుల్లోనే ఒక్కటైంది. యుద్ధం ఏమాత్రం తమ పెళ్లికి ఆటంకం కాదంటూ.. రణ క్షేత్రంలోనే ఈ ప్రేమ జంట పెళ్లి చేసుకుంది.

Viral Video: యుద్ధం మా ప్రేమను విడదీయలేదు.. సైనిక దుస్తుల్లోనే ఒక్కటైన ఉక్రెయిన్‌ జంట.. వీడియో
Ukrainian Couple
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 23, 2022 | 6:22 AM

Ukrainian Couple Married In Military Uniforms: రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. దాదాపు మూడున్నర నెలల నుంచి రష్యా సేనలు ఉక్రెయిన్ పై విరుచుకుపడుతున్నాయి. అయినప్పటికీ.. ఉక్రెయిన్ సైన్యం ధీటుగా జవాబిస్తోంది. ఈ క్రమంలో ఆ దేశంలో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఇలాంటి యుద్ధ వాతావరణ పరిస్థితుల్లోనే ఓ ప్రేమ జంట సైనిక దుస్తుల్లోనే ఒక్కటైంది. యుద్ధం ఏమాత్రం తమ పెళ్లికి ఆటంకం కాదంటూ.. రణ క్షేత్రంలోనే ఈ ప్రేమ జంట పెళ్లి చేసుకుంది. ఎలాంటి ఆర్బాటాలు, ఆడంబరాలకు పోకుండా ఆర్మీ దుస్తుల్లోనే నవ దంపతులు ఒక్కటయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీనిని చూసి నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. యుద్ధం ప్రేమికులను విడదీయలేదంటూ పేర్కొంటున్నారు నెటిజన్లు.

సైనిక దుస్తుల్లోనే ఒక్కటైన వధూవరులిద్దరూ చర్చి నుంచి బయటకు రాగా.. బంధువులు, స్నేహితులు కేరింతలు కొడుతూ వారికి స్వాగతం పలికారు. దీనికి సంబంధించి ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఆంటోన్ గెరాశ్చన్కో (Anton Gerashchenko) ట్విట్టర్‌లో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈరోజుల్లో ఉక్రెయిన్‌లో వివాహాలు ఇలాగే జరుగుతున్నాయి.. తెల్లటి దుస్తులు లేవు. ఆర్బాటం అంతకంటే లేదు.. కానీ వారి మనసుల నిండా ప్రేమ ఉందంటూ మంత్రి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో..

ఇదిలాఉంటే.. యుద్ధం ప్రారంభమైన తొలిరోజుల్లో కూడా ఓ ప్రేమ జంట రణ క్షేత్రంలోనే సైనిక దుస్తుల్లోనే ఒక్కటయ్యారు. మార్చి 6న ఉక్రెయిన్లోని కీవ్‌లో 112 బ్రిగేడ్‌కు చెందిన సైనికులు లెసియా, వాలెరీ ఫైలిమోనివ్ వివాహం చేసుకున్నారు. అప్పుడు కూడా దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?