Trending Song: ఏం పాట భయ్యా.. దెబ్బకు 105 సాంగ్స్ రిజెక్ట్ అయ్యాయి.. ఇప్పటికీ యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్..
భారతీయ చిత్రపరిశ్రమలో ఇతిహాసాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాయి. అలాగే అనేక పాటలు శ్రోతల హృదయాల్లో నిలిచిపోయాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సాంగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సంవత్సరాలు గడిచిన ఈ పాటకు ఉండే వైబ్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ యూట్యూబ్ లో టాప్ మిలియన్ వ్యూస్.

ప్రస్తుతం యూట్యూబ్ లో తెలంగాణ ఫోక్ సాంగ్స్ సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. నెలకో పాట సోషల్ మీడియా ప్రపంచాన్ని ఏలేస్తుంది. మరోవైపు మూవీ సాంగ్స్ సైతం సత్తా చాటుతున్నాయి. తక్కువ సమయంలోనే విపరీతైన వ్యూస్ అందుకుంటున్నాయి. కానీ ఒక సాంగ్ గురించి మీకు తెలుసా.. ? 1960 ఆగస్ట్ 5న హిందీలో మొఘల్ – ఎ – ఆజం అనే ఇతిహాస సినిమా విడుదలై భారీ తుఫాను సృష్టించింది. అప్పట్లోనే బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టింది. ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే ” జబ్ ప్యార్ కియా తో డర్నా కియా” అనే సాంగ్ గురించి చెప్పక్కర్లేదు. అప్పట్లో ఈ పాట యావత్ భారతీయ సినీ ప్రపంచంలో సంచలనం సృష్టించింది.
ఎక్కువమంది చదివినవి : Actress : మగాళ్ల నుంచి నన్ను నేను కాపాడుకోలేకపోయాను.. టాలీవుడ్ నటి కామెంట్స్ వైరల్..
ఈ పాట గురించి మాట్లాడితే స్వరకర్త నౌషాద్ అలీ చూపిన అంకితభావం ఎంతో గొప్పది. గేయ రచయిత షకీల్ బదాయుని రాసిన 105 చరణాలను నౌషాద్ తిరస్కరించారు. చివరకు 106వ చరణాన్ని సాహిత్యం, సంగీతం ఆకట్టుకున్న పాటను సినిమా కోసం ఖరారు చేశారు. ఈ పాట నిడివి దాదాపు 6 నిమిషాల 16 సెకన్లు. దర్శకుడు కె. ఆసిఫ్ ఈ సినిమా తీయడానికి 16 సంవత్సరాలు పట్టింది. ఈ పాట చిత్రీకరణ కోసమే ముంబైలోని ఒక స్టూడియోలో ‘శీష్ మహల్’ (అద్దాల ప్యాలెస్) లాంటి భారీ సెట్ నిర్మించారు.
ఎక్కువమంది చదివినవి : Tollywood : నా శరీర ఆకృతి కారణంగా రోజూ నరకం అనుభవిస్తున్నా.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్..
అప్పట్లో దీనికోసం దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేశారు. భారతీయ సినిమా చరిత్రలో ఒక పాట కోసం ఖర్చు చేసిన అతిపెద్ద మొత్తంగా దీనిని భావిస్తారు. ఇక ఈ పాటకు సింగర్ లతా మంగేష్కర్ తన మధురమైన గాత్రంతో ప్రాణం పోశారు. అప్పట్లో ఆధునిక సాంకేతికతలు లేనందున, ప్యాలెస్‌లో పాడటం వంటి ప్రతిధ్వని ప్రభావాన్ని సృష్టించడానికి నౌషాద్ లతను స్టూడియోలోని బాత్రూంలో పాడమని అడిగాడు. నేటికీ, వాస్తవిక ధ్వని అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది.
ఈ పాటకు ప్రాణం పోసిన మరో నటి మధుబాల. ఆమె అందం, దుస్తులతో కట్టిపడేసింది. పాట కోసమే భారీ నగలు ధరించి డ్యాన్స్ చేసింది. అక్బర్ చక్రవర్తి శక్తి ముందు తన ప్రేమను నిర్భయంగా వ్యక్తపరుస్తూ, పాటను దృశ్య కావ్యంలా మార్చాయి. 65 సంవత్సరాల తరువాత కూడా ఈ పాట యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోవడం గమనార్హం.
ఎక్కువమంది చదివినవి : Actress : డబ్బు కోసమే అలాంటి సినిమాల్లో నటించా.. ఓపెన్‌గా చెప్పేసిన హీరోయిన్..
ఎక్కువమంది చదివినవి : సీరియల్స్‌లో లక్షల్లో సంపాదన.. శ్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే..
