AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Song: ఏం పాట భయ్యా.. దెబ్బకు 105 సాంగ్స్ రిజెక్ట్ అయ్యాయి.. ఇప్పటికీ యూట్యూబ్‏లో మిలియన్ వ్యూస్..

భారతీయ చిత్రపరిశ్రమలో ఇతిహాసాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాయి. అలాగే అనేక పాటలు శ్రోతల హృదయాల్లో నిలిచిపోయాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సాంగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సంవత్సరాలు గడిచిన ఈ పాటకు ఉండే వైబ్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ యూట్యూబ్ లో టాప్ మిలియన్ వ్యూస్.

Trending Song: ఏం పాట భయ్యా.. దెబ్బకు 105 సాంగ్స్ రిజెక్ట్ అయ్యాయి.. ఇప్పటికీ యూట్యూబ్‏లో మిలియన్ వ్యూస్..
Trending Song
Rajitha Chanti
|

Updated on: Mar 13, 2026 | 9:33 PM

Share

ప్రస్తుతం యూట్యూబ్ లో తెలంగాణ ఫోక్ సాంగ్స్ సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. నెలకో పాట సోషల్ మీడియా ప్రపంచాన్ని ఏలేస్తుంది. మరోవైపు మూవీ సాంగ్స్ సైతం సత్తా చాటుతున్నాయి. తక్కువ సమయంలోనే విపరీతైన వ్యూస్ అందుకుంటున్నాయి. కానీ ఒక సాంగ్ గురించి మీకు తెలుసా.. ? 1960 ఆగస్ట్ 5న హిందీలో మొఘల్ – ఎ – ఆజం అనే ఇతిహాస సినిమా విడుదలై భారీ తుఫాను సృష్టించింది. అప్పట్లోనే బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టింది. ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే ” జబ్ ప్యార్ కియా తో డర్నా కియా” అనే సాంగ్ గురించి చెప్పక్కర్లేదు. అప్పట్లో ఈ పాట యావత్ భారతీయ సినీ ప్రపంచంలో సంచలనం సృష్టించింది.

ఎక్కువమంది చదివినవి : Actress : మగాళ్ల నుంచి నన్ను నేను కాపాడుకోలేకపోయాను.. టాలీవుడ్ నటి కామెంట్స్ వైరల్..

ఈ పాట గురించి మాట్లాడితే స్వరకర్త నౌషాద్ అలీ చూపిన అంకితభావం ఎంతో గొప్పది. గేయ రచయిత షకీల్ బదాయుని రాసిన 105 చరణాలను నౌషాద్ తిరస్కరించారు. చివరకు 106వ చరణాన్ని సాహిత్యం, సంగీతం ఆకట్టుకున్న పాటను సినిమా కోసం ఖరారు చేశారు. ఈ పాట నిడివి దాదాపు 6 నిమిషాల 16 సెకన్లు. దర్శకుడు కె. ఆసిఫ్ ఈ సినిమా తీయడానికి 16 సంవత్సరాలు పట్టింది. ఈ పాట చిత్రీకరణ కోసమే ముంబైలోని ఒక స్టూడియోలో ‘శీష్ మహల్’ (అద్దాల ప్యాలెస్) లాంటి భారీ సెట్ నిర్మించారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : నా శరీర ఆకృతి కారణంగా రోజూ నరకం అనుభవిస్తున్నా.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్..

అప్పట్లో దీనికోసం దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేశారు. భారతీయ సినిమా చరిత్రలో ఒక పాట కోసం ఖర్చు చేసిన అతిపెద్ద మొత్తంగా దీనిని భావిస్తారు. ఇక ఈ పాటకు సింగర్ లతా మంగేష్కర్ తన మధురమైన గాత్రంతో ప్రాణం పోశారు. అప్పట్లో ఆధునిక సాంకేతికతలు లేనందున, ప్యాలెస్‌లో పాడటం వంటి ప్రతిధ్వని ప్రభావాన్ని సృష్టించడానికి నౌషాద్ లతను స్టూడియోలోని బాత్రూంలో పాడమని అడిగాడు. నేటికీ, వాస్తవిక ధ్వని అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది.

ఈ పాటకు ప్రాణం పోసిన మరో నటి మధుబాల. ఆమె అందం, దుస్తులతో కట్టిపడేసింది. పాట కోసమే భారీ నగలు ధరించి డ్యాన్స్ చేసింది. అక్బర్ చక్రవర్తి శక్తి ముందు తన ప్రేమను నిర్భయంగా వ్యక్తపరుస్తూ, పాటను దృశ్య కావ్యంలా మార్చాయి. 65 సంవత్సరాల తరువాత కూడా ఈ పాట యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోవడం గమనార్హం.

ఎక్కువమంది చదివినవి : Actress : డబ్బు కోసమే అలాంటి సినిమాల్లో నటించా.. ఓపెన్‏గా చెప్పేసిన హీరోయిన్..

ఎక్కువమంది చదివినవి : సీరియల్స్‏లో లక్షల్లో సంపాదన.. శ్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే..

Follow Us
సంవత్సరాలుగా ఇండస్ట్రీలో చెక్కు చెదరని క్రేజ్.. ఈ పాట వేరేలెవల్..
సంవత్సరాలుగా ఇండస్ట్రీలో చెక్కు చెదరని క్రేజ్.. ఈ పాట వేరేలెవల్..
ఇలా చేస్తే ఎంతటి భయంకరమైన నరదిష్టి అయినా..
ఇలా చేస్తే ఎంతటి భయంకరమైన నరదిష్టి అయినా..
అబ్బాయిలూ.. ఈ విషయం తెలిస్తే జన్మలో జీన్స్ వేసుకోరు.. !
అబ్బాయిలూ.. ఈ విషయం తెలిస్తే జన్మలో జీన్స్ వేసుకోరు.. !
వితికా చెల్లి కొడుకు నామకరణం వేడుక.. ఏం పేరు పెట్టారంటే?
వితికా చెల్లి కొడుకు నామకరణం వేడుక.. ఏం పేరు పెట్టారంటే?
దేశ ఇంధన రంగంలో సరికొత్త అధ్యాయం.. బొగ్గు గ్యాసిఫికేషన్..
దేశ ఇంధన రంగంలో సరికొత్త అధ్యాయం.. బొగ్గు గ్యాసిఫికేషన్..
దోమలు కాదు ప్రాణాలు పోతాయ్.. వీటిని ఎందుకు బ్యాన్ చేస్తున్నారంటే
దోమలు కాదు ప్రాణాలు పోతాయ్.. వీటిని ఎందుకు బ్యాన్ చేస్తున్నారంటే
నమ్మరేమోగానీ, నల్లేరా మజాకా.. ఎముకలకు వజ్రం లాంటి బలం!
నమ్మరేమోగానీ, నల్లేరా మజాకా.. ఎముకలకు వజ్రం లాంటి బలం!
గ్యాస్ కొరతపై స్పందించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
గ్యాస్ కొరతపై స్పందించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఎగ్జిబిటర్‌ VS ప్రొడ్యూసర్స్ థియేటర్ల బంద్‌ దిశగా లొల్లి
ఎగ్జిబిటర్‌ VS ప్రొడ్యూసర్స్ థియేటర్ల బంద్‌ దిశగా లొల్లి
మా నటుడిని కించపరుస్తారా.. రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ చెప్పాల్సిందే
మా నటుడిని కించపరుస్తారా.. రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ చెప్పాల్సిందే