Ecuador Protests: హింసాత్మకంగా నిరసనలు.. ప్రజా తిరుగుబాటుతో అట్టుడుకుతున్న ఈక్వెడార్
దేశ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టలేని అధ్యక్షుడు గిల్లోర్మో లాస్సో (Guillermo Lasso) ప్రభుత్వం గద్దె దిగాలని ఈక్వేడార్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Ecuador Protests: దక్షిణ అమెరికా ఖండంలోని ఈక్వెడార్‌లో గత తొమ్మిది రోజులుగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతున్నాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పేదరికం సమస్యలను పరిష్కరించడలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ వేలాది మంది ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కరోనా సంక్షోభం తర్వాత దిగజారిన దేశ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టలేని అధ్యక్షుడు గిల్లోర్మో లాస్సో (Guillermo Lasso) ప్రభుత్వం గద్దె దిగాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పెరిగిన పెట్రోలు ధరలను తగ్గించాలని, వ్యవసాయ ఉత్పత్తుల ధరలపై నియంత్రణలు తొలగించాలి, విద్యారంగ బడ్జెట్‌ను పెంచాలని కోరినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈక్వెడాన్ జనాభాల్లో సగానికి ఎక్కువగా మూలవాసులు ఉంటారు. వీరంతా దేశ రాజధాని క్విటోకు తరలి వచ్చి ప్రదర్శనలు చేపట్టారు.
పోలీసులు కర్ఫ్యూ విధించినా లెక్క చేయకుండా నగరంలోని ప్రవేశించి నిరసనలకు దిగారు. అయితే ప్రభుత్వం నుంచి ఏ మాత్రం స్పందన కనిపించకపోవడంతో ఆందోళనాకారులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ వాహనాలు, ఆస్తులపై దాడులకు తెగబడుతున్నారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై తిరగబడ్డారు. ప్రధాన రహదారులు యుద్ధ రంగాన్ని తలపిస్తుయి. ఆందోళనాకారులను చెదరగోట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. టైర్లకు నిప్పటించింది పోలీసులు వైపు విసిరేశారు.
ఆందోళనలు ఇతర ప్రావిన్స్‌లకు కూడా విస్తరించడంతో దేశ వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. మరోవైపు ఆందోళనల కారణంగా రాజధాని క్విటోలా నిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..


