AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ‘అమ్మ ఒడి’ పథకం ఆ పిల్లలకు మాత్రమే.. కీలక ప్రకటన చేసిన మంత్రి బొత్స..

Andhra Pradesh: ‘అమ్మ ఒడి’ పథకానికి సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక కామెంట్స్ చేశారు. గురువారం నాడు

Andhra Pradesh: ‘అమ్మ ఒడి’ పథకం ఆ పిల్లలకు మాత్రమే.. కీలక ప్రకటన చేసిన మంత్రి బొత్స..
Botsa Satyanarayana
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 23, 2022 | 10:36 PM

Andhra Pradesh: ‘అమ్మ ఒడి’ పథకానికి సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక కామెంట్స్ చేశారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. అమ్మ ఒడి లబ్ధిదారుల సంఖ్య తగ్గిందనడం అవాస్తవం అని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులు హాజరు శాతం ఆధారంగానే అమ్మ ఒడి లబ్ధిదారుల ఎంపిక జరిగిందని, జరుగుతుందని తేల్చి చెప్పారు. పిల్లలను సక్రమంగా స్కూల్‌కి పంపితేనే పథకం వర్తిస్తుందన్నారు. ఎవరైతే స్కూల్‌కు సక్రమంగా వస్తూ, 75 శాతం హాజరు ఉన్న విద్యార్థులకు అమ్మ ఒడి పథకాన్ని వర్తింపజేస్తున్నామని మంత్రి బొత్స వివరించారు. ఇదే విషయాన్ని గతంలో ముఖ్యమంత్రి జగన్, అప్పటి విద్యాశాఖ మంత్రి కూడా అనేకమార్లు స్పష్టం చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు విద్యా శాఖ మంత్రిగా తాను కూడా అదే విషయాన్ని ఉద్ఘాటిస్తున్నానని అన్నారు. స్కూల్‌కు వెళ్లకుండా అమ్మ ఒడి పథకాన్ని ఇవ్వాలంటే కుదరదన్నారు. స్కూళ్ళల్లో డ్రాప్ అవుట్స్‌ ఉండకుండా ప్రతి ఒక్క విద్యార్థి చదువుకునేలా ప్రోత్సహించేందుకే ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని, అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించినప్పుడే అమలుపై మార్గదర్శకాలను స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు మంత్రి బొత్స.

పిల్లలను బడికి పంపించండి.. ‘మీ పిల్లలను బడికి పంపించండి.. అమ్మ ఒడిని సద్వినియోగం చేసుకోండి..’’ అని విద్యార్థుల తల్లిదండ్రులకు మంత్రి బొత్స విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఇస్తున్న ఈ సౌకర్యాన్ని అర్హులైన వారంతా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. స్కూళ్ళకు పంపడం ద్వారా పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పాలన్నారు. పిల్లలను చదివించేందుకు, వారికి ఆర్థిక పరమైన విషయాల్లో ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. నాడు-నేడు కార్యక్రమం ద్వారా కార్పొరేట్, ప్రయివేట్‌ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. విద్యా బోధనతో పాటు, బైజూస్ ద్వారా పిల్లల్లో నైపుణ్యాన్ని పెంచుతున్నామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత శాతం తగ్గలేదు.. ఈ ఏడాది ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత శాతం తగ్గలేదని మంత్రి బొత్స పేర్కొన్నారు. 2019 సంవత్సరంలో కంటే ఇప్పుడు ఇంటర్‌ ఉత్తీర్ణత శాతం పెరిగిందని చెప్పారు. కొవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది పదో తరగతి ఫలితాలలో ఉత్తీర్ణత శాతం తగ్గగా, ఇప్పుడు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తూ అదే స్టేటస్‌ను ఇస్తున్నామని చెప్పారు. ఉపాధ్యాయుల కొరత ఉంటే తీరుస్తామని చెప్పారు. పాఠశాలు, కళాశాలల్లో అధ్యాపకుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాఠశాలలల్లో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు, వాచ్ మెన్ ఇతర సౌకర్యాల ఏర్పాటు, వాటి నిర్వహణ కోసమే రెండు వేల రూపాయిలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి బొత్స వివరించారు.