Viral Photo: పెళ్లికోసం యువకుడి వినూత్న ప్రయత్నం.. దెబ్బకు నగరం అంతా షాక్.. ఇంతకీ అతను ఏం చేశాడంటే..!

Viral Photo: అమ్మాయి అయినా, అబ్బాయి అయినా పెళ్లీడు వచ్చిందంటే.. ఇంట్లోని పెద్దలు వారికి సరిజోడు సంబంధాలు వెతకడం ప్రారంభిస్తారు.

Viral Photo: పెళ్లికోసం యువకుడి వినూత్న ప్రయత్నం.. దెబ్బకు నగరం అంతా షాక్.. ఇంతకీ అతను ఏం చేశాడంటే..!
Viral Photo
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 23, 2022 | 5:49 PM

Viral Photo: అమ్మాయి అయినా, అబ్బాయి అయినా పెళ్లీడు వచ్చిందంటే.. ఇంట్లోని పెద్దలు వారికి సరిజోడు సంబంధాలు వెతకడం ప్రారంభిస్తారు. తెలిసిన వారికి సమాచారం ఇచ్చి.. సంబంధాలు చూస్తారు. లేదంటే మ్యారేజీ బ్యూరోల ద్వారా ఈడూ జోడూ అయిన వారిని సెలక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే, ఇందుకోసం చాలా టైమ్, మనీ వెచ్చించాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఓ యువకుడు తన పెళ్లి కోసం సరికొత్త ఐడియాను ఇంప్లిమెంట్ చేశాడు. వెంటనే పెళ్లి కావాలంటే మ్యారేజీ బ్యూరోలకు వెళ్లడం టైమ్ వేస్ట్ అని, అతని ఐడియా ఊరందరికీ తెలిసేలా చేశాడు ఆ యువకుడు. మరి అతని ఐడియా ఏంటి? ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

వివరాల్లోకెళితే.. మధురై టౌన్‌లోని విల్లాపురానికి చెందిన సుదర్శన్, చంద్ర దంపతుల రెండవ కుమారుడు జగన్. ఇతని వయస్సు 27 సంవత్సరాలు. బిఎస్సి పూర్తి చేసి ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో జగన్ కి పెళ్లి చేయాలని ఇంట్లో కుటుంబ సభ్యులు సంబంధాలు చూస్తుండగా అవేవీ వర్కౌట్ అవడం లేదు. అదే సమయంలో తన ఫ్రెండ్స్ అందరికి పెళ్లిళ్లు అవుతున్నా.. తనకి మాత్రం కొన్ని కారణాల వల్ల ఏ సంబంధం కుదరకపోవడంతో ఇక లాభం లేదనుకున్నాడు. ‘‘ఊరందరికీ నేను పెళ్ళికి సిద్ధంగా ఉన్నాను. మీ దగ్గర మంచి సంబంధం ఉంటే, అమ్మాయి ఉంటే చెప్పండి.’’ అని మధురై టౌన్ మొత్తం పోస్టర్లు వేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఈ పోస్టర్లలో తనకి సంబంధించిన అన్ని వివరాలు ప్రకటించి, ఎవరైనా సంప్రదించాలనుకుంటే ఫోన్ చేయండి అని మొబైల్ నెంబర్ కూడా పెట్టాడు. మదురై లో ఒక్క చోటు కూడా వదలకుండా మీనాక్షి టెంపుల్ దగ్గర నుంచి హైకోర్టు వరకు అన్ని చోట్లా పోస్టర్లు వేయడంతో చాలా మంది జగన్ ని సంప్రదించడం మొదటు పెట్టారు. కాగా, జగన్ ఐడియా ఇప్పుడు మధురై టౌన్‌లో వైరల్‌గా మారింది . సోషల్ మీడియాలో కూడా జగన్ ఐడియాకి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు. త్వరలోనే జగన్ కి పెళ్లి కావాలని సోషల్ మీడియాలో విషెస్ చేబుతున్నారు నెటిజెన్స్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

అందుకే చలికాలంలో క్యాబేజీ తప్పకుండా తినాలట..
అందుకే చలికాలంలో క్యాబేజీ తప్పకుండా తినాలట..
వినతులు వినే గణపతి.. దర్శనంతోనే కోరిన కోర్కెలు తీర్చే దైవం..
వినతులు వినే గణపతి.. దర్శనంతోనే కోరిన కోర్కెలు తీర్చే దైవం..
పివి నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోసిన మన్మోహన్
పివి నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోసిన మన్మోహన్
హెల్మెట్స్ లేకుండా చిక్కితే మీకు వాయింపు మాములుగా ఉండదు
హెల్మెట్స్ లేకుండా చిక్కితే మీకు వాయింపు మాములుగా ఉండదు
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా?
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా?
నార్త్‌ మీద జాన్వీ ఫోకస్‌ తగ్గించారా ??
నార్త్‌ మీద జాన్వీ ఫోకస్‌ తగ్గించారా ??
ఆవ పెట్టిన పనస పొట్టు కూర.. అమ్మమ్మ స్టైల్ లో తయారు చేసుకోండి ఇలా
ఆవ పెట్టిన పనస పొట్టు కూర.. అమ్మమ్మ స్టైల్ లో తయారు చేసుకోండి ఇలా
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ ఈ వయసు వారికి డేంజర్‌.. గుండెపోటు తప్పదు
పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ ఈ వయసు వారికి డేంజర్‌.. గుండెపోటు తప్పదు