AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: చిన్నారిని కాటేసి చనిపోయిన నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వార్తలో అసలు నిజమేంటి?

Viral: అత్యంత విషపూరితమైన పాము ఒక వ్యక్తిని కాటేస్తే ఏమవుతుంది? అదృష్టం ఉంటే బ్రతికి బయటపడుతారు తప్ప.. దాదాపుగా ప్రాణాలు కోల్పోయే..

Viral: చిన్నారిని కాటేసి చనిపోయిన నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వార్తలో అసలు నిజమేంటి?
Child
Shiva Prajapati
|

Updated on: Jun 23, 2022 | 8:35 PM

Share

Viral: అత్యంత విషపూరితమైన పాము ఒక వ్యక్తిని కాటేస్తే ఏమవుతుంది? అదృష్టం ఉంటే బ్రతికి బయటపడుతారు తప్ప.. దాదాపుగా ప్రాణాలు కోల్పోయే అవకాశాలు అధికంగానే ఉన్నాయి. కానీ, ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. కాటేసిన పామే గిల గిల కొట్టుకుంటూ ప్రాణాలు విడిచింది. ఈ విచిత్ర సంఘటన బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో చోటు చేసుకుంది. ఇప్పుడిది దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అవును, మీరు చదవింది అక్షరాలా నిజం. గోపాల్‌గంజ్‌ జిల్లా బరౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాధోపూర్ గ్రామంలో అనూజ్(4) నాగుపాము కాటేసింది. అయితే, కాటేసిన తరువాత కాసేపటికి పాము అక్కడే చనిపోగా.. ఆ చిన్నారి మాత్రం ఆడుతూ కనిపించాడు. ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇదే అంశంపై జాతీయ మీడియాలోనే వరుస కథనాలు వస్తున్నాయి. జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. ఆ చిన్నారి తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా ఉన్న పొలంలోంచి ఓ నాగుపాము వచ్చి.. అనూజ్‌ను కాటేసింది. పామును చూసి మిగతా పిల్లలంతా పరుగులు తీశారు. పాము కరిచిన విషయాన్ని అనూజ్ తన కుటుంబ సభ్యులకు తెలియజేయగా.. వారు అక్కడ ఉన్న పెద్దలు కర్రలు తీసుకువచ్చి పామును చంపడానికి ప్రయత్నించారు. అయితే, ప్రజలు ఆ పామును కొట్టోలోపే.. అదే ప్రాణాలు విడిచింది. కాగా, పాము కాటుకు గురైన చిన్నారి అనూజ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు చికిత్స అందించారు. అనూజ్ ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు. అయితే, పాము ఎలా చనిపోయిందనేదే ఇప్పుడు మిస్టరీగా మారింది. పాము కాటుకు గురైన పిల్లాడు ఆరోగ్యంగా ఉన్నాడు.. పాము మాత్రం చనిపోవడం ఇప్పుడ మిస్టరీగా మారింది.

ఈ వార్తలో అసలు నిజమేంటి? ఇదిలాఉంటే.. పాము కాటు వార్తలో నిజం లేదని ఫ్యాక్ట్ చెక్‌లో తెలుస్తోంది. చిన్నారిని పాము కాటు వేయలేదని వైద్యులు తేల్చి చెప్పారు. బాబును పరిశీలించామని, ఎలాంటి పాము కాటు అతని శరీరంపై లేదని వైద్యులు తెలిపారు. అయితే, పాము ఎలా చనిపోయిందనేది ప్రశ్నార్థకంగా మారింది. స్థానిక ప్రజలే ఆ పామును కొట్టి చంపేసి ఉంటారని, ఆ బాధ్యత నుంచి తప్పించుకోవడం కోసం ఇలా స్టోరీలు చెబుతున్నారేమో అని అంతా భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇందులో నిజమెంత? పాము ఎలా చనిపోయింది? అనే అంశాన్ని తేల్చే పనిలో పడ్డారు అధికారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

పవన్ సార్.. ఒక్క ఛాన్స్ ప్లీజ్.. మీ దగ్గర మొత్తం బయట పెడత
పవన్ సార్.. ఒక్క ఛాన్స్ ప్లీజ్.. మీ దగ్గర మొత్తం బయట పెడత
రేపే చంద్ర సంచారం.. వీరు జాగ్రత్త ఉండకపోతే ముప్పు తిప్పలు తప్పవు!
రేపే చంద్ర సంచారం.. వీరు జాగ్రత్త ఉండకపోతే ముప్పు తిప్పలు తప్పవు!
సిరీస్ మొత్తం అవే.. ఒంటరిగా చూడాల్సిందే
సిరీస్ మొత్తం అవే.. ఒంటరిగా చూడాల్సిందే
ఆచితూచి తిన్నా బరువు పెరుగుతున్నారా? ఇలా ఎందుకు జరుగుతుందంటే..
ఆచితూచి తిన్నా బరువు పెరుగుతున్నారా? ఇలా ఎందుకు జరుగుతుందంటే..
శివరాత్రి రోజున అస్సలే చేయకూడని తప్పులు ఇవే!
శివరాత్రి రోజున అస్సలే చేయకూడని తప్పులు ఇవే!
స్టైల్ గా ఉరేసుకుంటూ రీల్ చేసిన మహిళ.. కట్ చేస్తే సీన్ రివర్స్
స్టైల్ గా ఉరేసుకుంటూ రీల్ చేసిన మహిళ.. కట్ చేస్తే సీన్ రివర్స్
పార్వతీదేవి స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం.. ఈ ఆలయం ఎక్కడ ఉందంటే
పార్వతీదేవి స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం.. ఈ ఆలయం ఎక్కడ ఉందంటే
మటన్‌లోని ప్రతీ పార్టూ పవర్‌ఫులే.. ఇది తెలిస్తే ఇంకేం తినరు..
మటన్‌లోని ప్రతీ పార్టూ పవర్‌ఫులే.. ఇది తెలిస్తే ఇంకేం తినరు..
ఏటీఎం చోరీకి వచ్చి అడ్డంగా బుక్కైన దొంగ.. అతను ఎవరో తెలిసి..
ఏటీఎం చోరీకి వచ్చి అడ్డంగా బుక్కైన దొంగ.. అతను ఎవరో తెలిసి..
ప్రెగ్నెంట్‌ సమయంలో మహిళలను ఎందుకని పాము కాటు వేయదు?
ప్రెగ్నెంట్‌ సమయంలో మహిళలను ఎందుకని పాము కాటు వేయదు?