AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EV Charging Stations: హైదరాబాద్‌వాసులకు శుభవార్త.. నగరంలో 300 ఈవీ ఛార్జింగ్​ స్టేషన్లు

ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లోనూ ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. కొనుగోలుదారులు కూడా ఈవీలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. పెరుగుతున్న ఇంధన ధరలు,

EV Charging Stations: హైదరాబాద్‌వాసులకు శుభవార్త.. నగరంలో 300 ఈవీ ఛార్జింగ్​ స్టేషన్లు
Ev Charging
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 23, 2022 | 1:03 PM

ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లోనూ ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. కొనుగోలుదారులు కూడా ఈవీలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. పెరుగుతున్న ఇంధన ధరలు, వాతావరణ కాలుష్యం వంటి కారణలతో ఎలక్ట్రిక్ వాహనాల వైపు వినియోదారులు మొగ్గుచూపుతున్నారు. అయితే బ్యాటరీతో నడిచే ఈ వాహనాలు ఛార్జింగ్ చాలా కీలకం. ఎప్పుడైన ఎక్కడైన చార్జింగ్ అవసరం ఏర్పడ వచ్చు. అయితే ఛార్జింగ్ సమస్యను పరిష్కరించేందుకు, పర్యావరణ హితమైన, ఈవీ లను మరింత ప్రోత్సహించేందుకు గ్రేటర్ హైదరాబాద్ అధికారులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.

కేంద్ర ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోళ్లపై సబ్సిడీ ఇస్తుండడంతో ఈవీ వాహనాలు కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఛార్జింగ్‌ స్టేషన్లు కీలకం అవుతున్నాయి. ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి నిర్ణీత కిలోమీటర్లు మాత్రమే వాహనం ప్రయాణిస్తుంది. ఛార్జింగ్‌ అయిపోతే తిరిగి ఇంధనం వినియోగించాలి. దీనిని దృష్టిలో ఉంచుకొని నగరంలో విరివిగా ఛార్జింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేయాలని గ్రేటర్ హైదరాబాద్ అధికారుల నిర్ణయించారు. ఈ మేరకు నగరంలోని 300 ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వెహికిల్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. వీటిని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) తో పాటు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలో ఏర్పాటు చేయనున్నారు. ఇందిరా పార్క్, కేబీర్ పార్క్గేట్ 1, సంతోష్ నగర్ (ఒవైసీ హాస్పిటల్ సమీపంలో), ఉప్పల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ ప్రాంతం వంటి అనేక ప్రదేశాలలో ఇవి అందుబాటులోకి రానున్నాయి.

జీహెచ్ఎంసీ పరిధిలో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను త్వరలో జీహెచ్ ఎంసీ స్టాండింగ్ కమిటీ ముందు ఉంచి, ఆమోదిస్తామని బల్దియా అధికారులు తెలిపారు. నగరంలో ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించారు. అవసరం ఎక్కువగా ఉన్న చోట వాటి సంఖ్యను పెంచుతారు. ఈ మేరకు ఆదాయ-భాగస్వామ్య నమూనాలో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ, టీఎస్ఆర్ఈడీసీఓ (తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) మధ్య ఒప్పందం కుదిరింది.

ఇవి కూడా చదవండి

ప్రసుతం హైదరాబాద్ నగరంలో దాదాపు 150 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీటిని హైదరాబాద్ మెట్రో రైల్ స్టేషన్లు, రైల్వే స్టేషన్‌లు, సాధారణ పెట్రోల్ బంక్‌ల సమీపంలో ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో ఇందిరా పార్క్, కేబీఆర్ పార్క్ గేట్-1, గేట్-3, గేట్-6, ట్యాంక్ బండ్ రోడ్, అబిడ్స్ మున్సిపల్ పార్కింగ్ కాంప్లెక్స్, నానక్ రాంగూడ , వనస్థలిపురంలోని మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్, ఉప్పల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ ప్రాంతం, సంతోష్ నగర్ (ఒవైసీ హాస్పిటల్ దగ్గర), సికింద్రాబాద్ తాజ్ త్రిస్టార్ హోటల్ సమీపంతో పాటు మరిన్ని ప్రాంతాల్లో ఈవీ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి