Bogatha Waterfalls: బొగత సొగసు చూడతరమా!..ఆంక్షలు లేని అనుమతితో సందర్శకుల తాకిడి
మరోవైపు ముత్యాల ధార, కొంగాల జలపాతాలు కూడా జలకళతో ఉట్టిపడుతున్నాయి. జలపాతాల అందాలను వీక్షించేందుకు సందర్శకులు క్యూ కడుతున్నారు..గత రెండేళ్లుగా కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో సందర్శకులను లిమిటెడ్ గా అనుమతించారు. కరోనా కారణంగా

రుతుపవనాలు రాకతో రైతులు బిజీ అయ్యారు.. వాతావరణం పూర్తిగా చల్లబడింది.. మరోవైపు వాగులు, కుంటలు, చెరువుల్లో జలకళ కనిపిస్తుంది. ఇంకోవైపు తొలకరి వర్షాలతో జలపాతాలకు జలకళ సంతరించుకుంది.. ములుగు జిల్లాలోని జలపాతాలు పాల ధారలా జాలువారుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో బోగత జలపాతాలు నిండు కుండలా జాలు వారుతున్నాయి.. బోగత జలపాతాలను వీక్షించేందుకు సందర్శకులు భారీగా తరలివస్తున్నారు.. బాహుబలి సినిమా సెట్టింగ్ తరహాలో జాలువారుతున్న జలపాతాలలో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. రెండేళ్ల తర్వాత ఎలాంటి కోవిడ్ ఆంక్షలు లేకుండా జలపాతాల సందర్శనకు అనుమతిస్తున్నారు.
మరోవైపు ముత్యాల ధార, కొంగాల జలపాతాలు కూడా జలకళతో ఉట్టిపడుతున్నాయి. జలపాతాల అందాలను వీక్షించేందుకు సందర్శకులు క్యూ కడుతున్నారు..గత రెండేళ్లుగా కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో సందర్శకులను లిమిటెడ్ గా అనుమతించారు. కరోనా కారణంగా పర్యాటక ప్రాంతాల సందర్శన నిలిపివేయడంతో ప్రకృతి అందాలను ఆస్వాదించే పర్యాటకులు నిరాశకు లోనయ్యారు. కరోనా సృష్టించిన విలయంతో పర్యాటకులు లేక బోసిపోయిన సుందర ప్రదేశాలు పున: ప్రారంభం కావడంతో పర్యాటక ప్రాంతాలు సందడిగా మారుతున్నాయి.

తెలంగాణ జలపాతం బొగత గలగలమంటూ ఉరకలు వేస్తోంది. ప్రకృతి ప్రేమికుల మనసు దోచుకుంటూ కొత్తనీటితో నూతన కళ సంతరించుకుంది. కోవిడ్ నుండి పూర్తి స్వేచ్ఛ లభించడంతో ఎలాంటి ఆంక్షలు లేకుండా జలపాతాలు వీక్షించేందుకు సందర్శకులకు అనుమతిస్తున్నారు. దాంతో సందర్శకుల తాకిడి పెరిగింది.. కానీ ఎలాంటి వసతులు లేకపోవడం, కనీసం రోడ్డు సక్రమంగా లేకపోవడంతో ప్రభుత్వం విమర్శలు మూట కట్టుకుంటుంది.