Indian Railways: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. పట్టాలెక్కనున్న మరో 97 స్పెషల్ ట్రైన్స్..

తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. దక్షిణ మధ్య రైల్వే పెరుగుతున్న ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 97 ప్రత్యేక రైళ్లను పట్టాలెక్కించనుంది.

Indian Railways: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. పట్టాలెక్కనున్న మరో 97 స్పెషల్ ట్రైన్స్..
Train
Follow us

|

Updated on: Jun 23, 2022 | 8:05 AM

తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) గుడ్ న్యూస్ అందించింది. పెరుగుతున్న ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రెండు రూట్లలో 97 స్పెషల్ ట్రైన్స్‌ను పట్టాలెక్కించనుంది. కాకినాడ-లింగంపల్లి-కాకినాడ మధ్య జూలై 1 నుంచి అక్టోబర్ 1 వరకు ప్రత్యేక రైలు సర్వీసులు(80) నడవనుండగా.. హైదరాబాద్-జైపూర్-హైదరాబాద్ మధ్య జూలై 1 నుంచి ఆగష్టు 28 వరకు స్పెషల్ ట్రైన్స్(17) నడవనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి…

07295(కాకినాడ టౌన్ – లింగంపల్లి) – ఈ రైలు వారంలో మూడు రోజులు(సోమవారం, బుధవారం, శుక్రవారం) నడవనుంది. ఆయా రోజుల్లో రాత్రి 8.10 గంటలకు కాకినాడ నుంచి బయల్దేరిన ఈ ట్రైన్.. మరుసటి రోజు ఉదయం 09.15 గంటలకు లింగంపల్లి చేరుతుంది. ఈ రూట్ మధ్య జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు స్పెషల్ ట్రైన్స్ నడవనున్నాయి.

07296(లింగంపల్లి – కాకినాడ టౌన్) – ఈ రైలు ప్రతీ మంగళవారం, గురవారం, శనివారం పట్టాలెక్కనుంది. ఆయా రోజుల్లో రాత్రి 6.25 గంటలకు లింగంపల్లి నుంచి బయల్దేరే ఈ ట్రైన్ మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు కాకినాడ చేరుతుంది. ఈ రూట్‌లో జూలై 2 నుంచి అక్టోబర్ 1 వరకు స్పెషల్ ట్రైన్స్ తిరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

కాకినాడ-లింగంపల్లి-కాకినాడ(07295/07296): సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్లొండ, సికింద్రాబాద్ స్టేషన్లలో ఈ స్పెషల్ ట్రైన్స్ ఆగుతాయని రైల్వే అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.

07115(హైదరాబాద్ – జైపూర్): జూలై 1 నుంచి ఆగష్టు 26 వరకు ఈ రూట్ల మధ్య స్పెషల్ ట్రైన్స్ నడవనున్నాయి. ప్రతీ శుక్రవారం నడిచే ఈ ట్రైన్ రాత్రి 8.20 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 5.25 గంటలకు జైపూర్ చేరుతుంది.

07116(జైపూర్ – హైదరాబాద్): జూలై 3 నుంచి ఆగష్టు 28 వరకు ఈ రూట్ల మధ్య నడిచే ఈ స్పెషల్ ట్రైన్ ప్రతీ ఆదివారం మధ్యాహ్నం 3.20 గంటలకు జైపూర్ నుంచి బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 3.00 గంటలకు హైదరాబాద్ చేరుతుంది.

హైదరాబాద్-జైపూర్-హైదరాబాద్(07115/07116): ఈ ట్రైన్స్ సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ, బస్మాట్, హింగోలి, వాషిం, అకోలా, మల్కాపూర్, ఖండ్వా, ఇతర్సి, భోపాల్, ఉజ్జయిన్, రట్లాం, మంద్సూర్, నిమచ్, చిత్తూర్‌గర్హ, భిల్వారా, బిజైనగర్, అజ్మీర్, ఫులేరా స్టేషన్స్‌లో ఆగుతుంది.

కాగా, ఈ స్పెషల్ ట్రైన్స్‌లో స్లీపర్ క్లాస్, ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయని.. ప్రయాణీకులు ఈ రైళ్లను సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

Railway Timetable