Weight Loss: ఉప్పు తక్కువగా తింటే బరువు తగ్గుతారా? నిజమెంత..

ఆహారంలో తక్కువ ఉప్పు తీసుకుంటే బరువు తగ్గొచ్చని, అలాగే అధిక ఉప్పు తీసకుంటే ప్రాణానికి హానికరమనే భావనలు ప్రచారంలో ఉంది. దీనిలో ఎంత వరకు నిజముందో, అసలు ఉప్పులేకుండా..

Weight Loss: ఉప్పు తక్కువగా తింటే బరువు తగ్గుతారా? నిజమెంత..
Weightloss With Salt
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 23, 2022 | 10:44 AM

Does salt increase weight: ఉప్పులేని కూర చప్పన అనేది ఎంత నిజమో ఆరోగ్య విషయంలోనూ ఉప్పు ప్రాధాన్యత అంతేనన్నది ఆరోగ్య నిపుణుల మాట. ఐతే ఆహారంలో తక్కువ ఉప్పు తీసుకుంటే బరువు తగ్గొచ్చని, అలాగే అధిక ఉప్పు తీసకుంటే ప్రాణానికి హానికరమనే భావనలు ప్రచారంలో ఉంది. దీనిలో ఎంత వరకు నిజముందో, అసలు ఉప్పులేకుండా ఆహారం తింటే ఏమౌతుందో? వంటి విషయాలపై ప్రముఖ పోషకాహార నిపుణురాలు కవితా దేవగన్ ఏం చెబుతున్నారంటే..

ఉప్పు మోతాదుకుమించి తింటే కలిగే దుష్ర్పభావాలు..

అధిక రక్తపోటు, ఫ్లూయిడ్‌ ఓవర్‌లోడ్‌, కార్డియోవ్యాస్క్యులర్‌ డిజార్డర్‌, ఎముకలు గుల్లబారడం వంటి వ్యాధులకు ఆహారంలో అధిక ఉప్పు కారణమే అయ్యినప్పటకీ.. కనీసం స్థాయిలోనైనా రోజువారీ ఆహారంలో ఉప్పు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే శరీర ఆరోగ్యానికి ఉప్పులోని పోషకాలు కూడా ఎంతో అవసరం. స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌, నరాల పనితీరు. కండరాల పటుత్వానికి ఉప్పు ఎంతో అవసరం. అలాగే శరీరంలోని వివిధ ద్రావణాలను సమతుల్యం చేయడంలోనూ ఉప్పు సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

ఉప్పు లేకుండా ఆహారం తీసుకుంటే..?

శరీరంలో ఉప్పు స్థాయిలు తగ్గితే చెమటలు పట్టడం, వాంతులు, విరేచనాలు, అలసట, లో బ్లడ్‌ ప్లెజర్‌, కండరాల తిమ్మిరి, కండరాల బలహీనతకు దారితీయవచ్చు. కాబట్టి ఉప్పును తగు మోతాదులో తీసుకోవడం మర్చిపోకూడదు. ఐతే అధిక రక్తపోటు విషయంలో ఈ సూత్రం వర్తించదు. ఇటువంటి వారు తక్కువ సోడియం ఉండే ఉప్పు వాడవచ్చు. అయోడైజ్డ్ చేసిన ఉప్పులో15 శాతం నుంచి 30 శాతం తక్కువ సోడియం ఉంటుంది.

సోడియం లోపిస్తే మానసిక సమస్యలు..

నిజానికి వండి తినగలిగే ప్రతి ఆహారంలో కొద్దిగా ఉప్పు (సోడియం క్లోరైడ్) ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇది మన మెదడు కణాలను పని తీరును నిర్వహిస్తుంది. శరీరంలో నీటి సమతుల్యతను నియంత్రిస్తుంది. కండరాలు, నరాల పనితీరును ప్రేరేపిస్తుంది. WHO ప్రకారం.. అయోడిన్‌ ఉన్న ఉప్పు మానసిక (Intellectual and Developmental Disabilities) రుగ్మతల భారీన పడకుండా నివారిస్తుంది.

ఉప్పు తక్కువగా తింటే బరువు తగ్గవచ్చు.. నిజమేనా?

ఉప్పు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో నీరు నిల్వస్థాయిలు పెరిగి, బరువు పెరగడానికి దారితీసే అవకాశం ఉంది. ఐతే తక్కువ ఉప్పు కలిగిన ఆహారాన్ని తరచూగా తీసుకుంటే శరీరంలో నీటి శాతం త్వరగా తగ్గిపోతుందే కానీ కొవ్వు అలాగే ఉంటుంది. నవీ ముంబైలోని అపోలో హాస్పిటల్స్‌లో క్లినికల్ న్యూట్రిషన్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్ వర్షా గోరే అభిప్రాయం ప్రకారం..

ఉప్పుతో బరువు తగ్గడం సాధ్యం కాదు

శరీర బరువును తగ్గించడంలో ఉప్పు ఏవిధంగానూ సహాయపడదు. ఇది ఒట్టి అపోహ మాత్రమే. ఉప్పు అనేది రసాయనికంగా సోడియం క్లోరైడ్ (NaCl). ఇది మన శరీరంలోని ఎలక్ట్రోలైట్ అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది. హైపోనాట్రేమియా (తక్కువ రక్త పోటు)ను నివారించడానికి సోడియం స్థాయిలు130 నుంచి 140 mEq/L మధ్యలో ఉండాలి. ఐతే ఈ పరిమాణం ప్రతి వ్యక్తికి భిన్నంగా ఉంటుంది. అయోడైజ్డ్ ఉప్పును ఆహారంలో తీసుకోవడం వల్ల సమతుల్యంగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గడానికి ఆహారంలో ఉప్పును తగ్గించడం కంటే ప్రాసెస్‌ చేసిన ఆహారం అంటే బేకరీ పదార్థాలు, జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.