JEE Main 2022: నేటి నుంచి జేఈఈ మెయిన్ 2022 మొదటి సెషన్ పరీక్షలు..
జేఈఈ మెయిన్ (JEE Main 2022) జూన్ సెషన్ పరీక్షలు మరికొన్ని గంటల్లో ప్రారంభంకానున్నాయి. దాదాపు దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు ఈ రోజు (జూన్ 23) నుంచి దేశ వ్యాప్తంగా 501 పరీక్ష కేంద్రాల్లో..
JEE Main 2022 Session 1 exam timings: జేఈఈ మెయిన్ (JEE Main 2022) జూన్ సెషన్ పరీక్ష మరికొన్ని గంటల్లో ప్రారంభంకానున్నాయి. దాదాపు దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు ఈ రోజు (జూన్ 23) నుంచి దేశ వ్యాప్తంగా 501 పరీక్ష కేంద్రాల్లో పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్షల ఏర్పాటుకు ఇప్పటికే ఎన్టీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రోజుకు రెండు సెషన్ల చొప్పున జూన్ 23, 24, 25, 26, 27, 28, 29 తేదీల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు ఆన్‌లైన్ విధానంలో పరీక్ష జరుగుతుంది ఉంటుంది.
జేఈఈ మెయిన్ 2022 మొదటి సెషన్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు తప్పనిసరిగా తమతోపాటు అడ్మిట్ కార్డులను పరీక్ష కేంద్రానికి తీసుకువెళ్లాలి. పరీక్ష సమయం మించిపోతే ఎట్టిపరిస్థితుల్లో లోపలికి అనుమతించరు. విధిగా కోవిడ్ 19 మార్గదర్శకాలను అనుసరించవల్సి ఉంటుంది. అంటే ఫేస్ మాస్క్, హాండ్ శానిటైజర్, సోషల్ డిస్టెన్స్ వంటి కోవిడ్ నియమాల ప్రకారం పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.
కాగా పరీక్షకు కేవలం రెండు రోజుల ముందే జేఈఈ మెయిన్‌కు అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. జూన్ 29 వరకు పరీక్షలు జరుగుతాయి కాబట్టి విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in నుంచి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకునే విషయంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే 011 – 40759000 నంబర్ లేదా jeemain@nta.ac.in మెయిల్ ద్వారా సంప్రదించవచ్చని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.