UPSC CSE Prelims 2022 Result: యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష 2022 ఫలితాలు విడుదల.. మెయిన్స్ తేదీలు ఇవే..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2022 ఫలితాలు బుధవారం (జూన్ 22) విడుదలయ్యాయి. జూన్ 5న జరిగిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు..
UPSC prelims 2022 rsults: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2022 ఫలితాలు బుధవారం (జూన్ 22) విడుదలయ్యాయి. జూన్ 5న జరిగిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు హాజరయిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in లేదా upsconline.nic.in.లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. కాగా తాజా ఫలితాల్లో మొత్తం 13,090 మంది అభ్యర్ధులు మెయిన్స్ పరీక్షలకు ఎంపికయినట్లు కమిషన్ ఈ సందర్భంగా తెలియజేసింది. అర్హత సాధించిన అభ్యర్ధులకు సెప్టెంబర్ 16 నుంచి 21 వరకు నిర్వహించే యూపీఎస్సీ మెయిన్స్ 2022 పరీక్షలకు హాజరుకావచ్చు. వీటికి సంబంధించిన అడ్మిట్ కార్డులు ఎప్పుడు విడుదల చేస్తారనేది కమిషన్ త్వరలో వెల్లడిస్తుంది. మెయిన్స్ అనంతరం ప్రతిభ కనపబరచిన అభ్యర్ధులను యూపీఎస్సీ నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకావల్సి ఉంటుంది. ఆ తర్వాత మెయిన్స్, ఇంటర్వ్యూల్లో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ర్యాంకుల ఆధారంగా అభ్యర్ధులను ఐఏఎస్, ఐసీఎస్ వంటి కేంద్ర సర్వీసులకు కేటాయించడం జరుగుతుంది. మరిన్ని తాజా అప్‌డేట్ల కోసం కమిషన్ వెబ్‌సైట్‌ను చెక్ చేసుకోవచ్చు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.