AP PGCET 2022: ఏపీ పీజీ సెట్-2022 నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే..
2022-23 విద్యా సంవత్సరానికి పీజీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ పోస్టు గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP PGCET 2022) 2022 నోటిఫికేషన్ బుధవారం (జూన్ 22) విడుదలైంది. ఈ మేరకు యోగి వేమన యూనివర్సిటీ వీసీ..
AP PGCET 2022 application last date: 2022-23 విద్యా సంవత్సరానికి పీజీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ పోస్టు గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP PGCET 2022) 2022 నోటిఫికేషన్ బుధవారం (జూన్ 22) విడుదలైంది. ఈ మేరకు యోగి వేమన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ మునగల సూర్యకళావతి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏపీ పీజీసెట్-2022 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న16 యూనివర్సిటీలు, అనుబంధ పోస్టుగ్రాడ్యుయేషన్, ప్రైవేటు, అన్‌ఎయిడెడ్, మైనార్టీ కాలేజీల్లో 145 కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తాం. ఆసక్తి కలిగిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ www.yvu.edu.in లేదా https://cets.apsche.ap.gov.inలో ఆన్‌లైన్ విధానంలో జులై 29 వరకు దరఖాస్తు చేసుకోవల్సిందిగా ఈ సందర్భంగా విద్యార్ధులకు సూచించారు.
నోటిఫికేషన్ ప్రకారం.. ఎటువంటి ఆలస్య రుసుము చెల్లించకుండా జులై 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.500 ఆలస్య రుసుముతో జులై 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.1000 ఆలస్య రుసుముతో జులై 29 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. హాల్ టికెట్లు ఆగస్టు 5 నుంచి వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ఏపీ పీజీసెట్-2022 ప్రవేశ పరీక్షలు ఆగస్టు 17 నుంచి 22 వరకు జరుగుతాయి. అభ్యర్థులు ఒక సబ్జెక్టుకు ఒకే అప్లికేషన్, ఒకే ఫీజు చెల్లించడం ద్వారా దాని పరిధిలోని అన్ని కోర్సులకు అర్హులవుతారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.