AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan Earthquake: అఫ్ఘన్‌లో మరో భూకంపం.. 1000కి పైగా మృతి! వేల మందికి గాయాలు

Afghanistan Earthquake: అఫ్ఘనిస్తాన్‌లో ఈ రోజు ఉదయం (జూన్‌ 23) 7 గంటల 18 నిముషాలకు మళ్లీ మరో భూకంపం సంభవించింది. .

Afghanistan Earthquake: అఫ్ఘన్‌లో మరో భూకంపం.. 1000కి పైగా మృతి! వేల మందికి గాయాలు
Afghanistan Earthquake
Srilakshmi C
| Edited By: |

Updated on: Jun 23, 2022 | 12:53 PM

Share

Afghanistan Deadliest Earthquake: తూర్పు అప్ఘనిస్తాన్‌లో బుధవారం తెల్లవారుజామున భయంకర భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఐతే ఈ రోజు ఉదయం (జూన్‌ 23) 7 గంటల 18 నిముషాలకు మళ్లీ మరో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ వెల్లడించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 4.3గా చూపింది. అఫ్ఘన్‌లోని ఫైజాబాద్‌కు నైరుతి భాగంలో 76 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది. వరుసగా రెండో రోజుకూడా భూకంపం సంభవించడంతో అఫ్ఘన్‌ ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

బుధవారం నాటి భూకంపంలో 1000కి పైగా మృతి చెందగా, 1500లకు పైగా ప్రజలు గాయపడ్డారు. భూకంప తీవ్రతకు అనేక ఇల్లు, సెల్‌ఫోన్‌ టవర్లు, రోడ్లు ధ్వంసమయ్యాయి. శిధిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారు. వేల మంది అఫ్ఘన్ ప్రజలు నిరాశ్రయులయ్యారు.  తూర్పు అప్ఘన్, పాకిస్తాన్‌ సరిహద్దుల్లోని కొండ ప్రాంతాల్లో వచ్చిన ఈ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.1గా నమోదైంది. ఖోస్ట్‌ నగరానికి 46 కి.మీ. దూరంలో, రాజధాని కాబూల్‌కు దక్షిణంగా 150 కి.మీ.దూరాన ఉన్న కొండ ప్రాంతం కేంద్రంగా భూమి కంపించిందని అమెరికా జియోలాజికల్‌ సర్వే (యూఎస్‌జీసీ) వెల్లడించింది. పాకిస్తాన్, ఇరాన్, భారత్‌ల్లోనూ 500 కిలోమీటర్ల మేర భూ ప్రకంపనలు సంభవించాయని, దీని తీవ్రతకు దాదాపు 119 మిలియన్ల ప్రజలు ప్రభావితమయ్యినట్లు యూరోపియన్‌ సిస్మలాజికల్‌ ఏజెన్సీ తెలిపింది. రెండు దశాబ్దాల తర్వాత ఇంత పెద్ద భూకంపం సంభవించడం ఇదే తొలిసారి. పొరుగు దేశాలు, ఇతర సంస్థలు అఫ్ఘన్‌ భూకంప బాధితులకు ఆహారం సరఫరా, వైద్య సేవలు, అత్యవసర సేవలు అందించడానికి ముందుకొచ్చాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తలు చదవండి..

2026లో ధనవంతులు అవ్వాలంటే.. ఇలా చేయండి!
2026లో ధనవంతులు అవ్వాలంటే.. ఇలా చేయండి!
జాగ్రత్త గురూ.. తక్కువ తాగినా ముప్పుతప్పదట.. తాజా అధ్యయనంలో సంచలన
జాగ్రత్త గురూ.. తక్కువ తాగినా ముప్పుతప్పదట.. తాజా అధ్యయనంలో సంచలన
ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్..
ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్..
ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే
ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే
MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!
MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్