BRO Recruitment 2022: పదో తరగతి అర్హతతో.. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌లో 1178 పోస్టులకు నోటిఫికేషన్..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO).. మల్టీ స్కిల్డ్ వర్కర్, స్టోర్ కీపర్ టెక్నికల్ పోస్టుల (Multy Skilled Worker Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..
BRO MSW, MSW Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO).. మల్టీ స్కిల్డ్ వర్కర్, స్టోర్ కీపర్ టెక్నికల్ పోస్టుల (Multy Skilled Worker Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 1178
పోస్టుల వివరాలు:
- మల్టీ స్కిల్డ్ వర్కర్ (మాసన్) పోస్టులు: 147
- మల్టీ స్కిల్డ్ వర్కర్ (నర్సింగ్ అసిస్టెంట్) పోస్టులు: 155
- స్టోర్ కీపర్ టెక్నికల్ పోస్టులు: 377
- మల్టీ స్కిల్డ్ వర్కర్ (డ్రైవర్ ఇంజిన్ స్టాటిక్) పోస్టులు: 499
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.18,000ల నుంచి 63,200ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే నర్సింగ్/ఏఎన్‌ఎమ్/జీఎన్‌ఎమ్, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
- జనరల్/ఈడబ్ల్యూఎస్/ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్ధులకు: రూ.50
- ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్‌మెన్/ఈడబ్ల్యూఎస్/పీహెచ్ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తులకు చివరి తేదీ:
- మల్టీ స్కిల్డ్ వర్కర్ (మాసన్, నర్సింగ్ అసిస్టెంట్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: జులై 22, 2022.
- స్టోర్ కీపర్ టెక్నికల్, మల్టీ స్కిల్డ్ వర్కర్ (డ్రైవర్ ఇంజిన్ స్టాటిక్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: జులై 11, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.