దేశవ్యాప్తంగా నెలకొన్న గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో, చెన్నైలోని ఒక రెస్టారెంట్ వంట గ్యాస్ ఛార్జీల పేరిట బిల్లులో రూ. 9.52 అదనంగా వసూలు చేసింది. ఈ బిల్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, నెటిజన్లు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ కొరత వల్ల ఖర్చులు పెరిగాయని హోటల్ యాజమాన్యం చెబుతోంది.