AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Producer C Kalyan: సమ్మెపై స్పందించిన ప్రొడ్యూసర్స్.. కార్మికుల వేతనాలు పెంచేందుకు సిద్ధం.. నిర్మాత సి.కళ్యాణ్ కామెంట్స్..

కార్మికులు చేస్తున్న సమ్మె గురించి తెలుసుకుని అందరం షాకయ్యాం.. ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి వేతనాలను పెంచుతూనే ఉన్నాం..

Producer C Kalyan: సమ్మెపై స్పందించిన ప్రొడ్యూసర్స్.. కార్మికుల వేతనాలు పెంచేందుకు సిద్ధం.. నిర్మాత సి.కళ్యాణ్ కామెంట్స్..
C Kalyan
Rajitha Chanti
|

Updated on: Jun 22, 2022 | 8:39 PM

Share

వేతనాలు పెంచాలంటూ తెలుగు చిత్రపరిశ్రమ కార్మికులు సమ్మె సైరన్ మోగించిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం ఫిల్మ్ ఛాంబర్ కార్యలయాన్ని ముట్టడించారు.. అయితే సినీ కార్మికులు చేపట్టిన సమ్మెపై నిర్మాతల మండలి స్పందించింది.. బుధవారం మధ్యాహ్నం సమావేశమైన నిర్మాతల మండలి.. మీడియాతో పలు ఆసక్తికర విషయాలను తెలియజేసింది… ఈ సందర్భంగా నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ… కార్మికులకు వేతనాలు పెంచేందుకు తమకు ఎలాంటి ఇబ్బంది లేదని.. గురువారం నుంచి కార్మికులంతా షూటింగ్స్‏లో పాల్గోనాలని కోరారు..

“కార్మికులు చేస్తున్న సమ్మె గురించి తెలుసుకుని అందరం షాకయ్యాం.. ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి వేతనాలను పెంచుతూనే ఉన్నాం.. ఈ క్రమంలోనే తమ వేతనాలు మరింత పెంచాలని కోరుతూ ఈనెల 6న వాళ్లు మాకు ఓ లేఖ రాశారు.. వేతనాలు పెంచడానికి నిర్మాతలకు ఎలాంటి ఇబ్బంది లేదు.. కానీ మాకు కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి.. అందరం కలిసి చర్చించుకుందామని వాళ్లకు చెప్పాం.. కానీ వాళ్లు ఇలా ఆకస్మాత్తుగా సమ్మె చేయడం తప్పు..నిర్మాతలందరూ షూటింగ్స్ కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నారు.. కాబట్టి రేపటి నుంచి కార్మికులు షూటింగ్స్ లోకి వస్తేనే వేతనాలు, విధివిధానాపై శుక్రవారం చర్చించి నిర్ణయం తీసుకుంటాం.. లేదంటే షూటింగ్స్ చేయడానికి నిర్మాతలు సైతం సిద్ధంగా లేరు.. ఇలా సమ్మెతో ఇబ్బందులు పెట్టకండి.. సినిమాలు చేస్తేనే పని ఉంటుంది.. సమ్మె నోటీసులు మాకు పంపలేదు.. “అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025.. కోమటి రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025.. కోమటి రెడ్డి కీలక ప్రకటన
ఆ రాశి నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
ఆ రాశి నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
పళ్లు ఊడిపోతే పోషకాహార లోపం! చిరునవ్వు వెనుక దాగున్న దీర్ఘాయువు
పళ్లు ఊడిపోతే పోషకాహార లోపం! చిరునవ్వు వెనుక దాగున్న దీర్ఘాయువు
Ram Charan: 8 నుంచి 6 వరకు మాత్రమే నేను హీరోను!
Ram Charan: 8 నుంచి 6 వరకు మాత్రమే నేను హీరోను!
టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న స్టార్ హీరో
టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న స్టార్ హీరో
ఇప్పుడే సినిమా చూశా.. చాలా అద్బుతంగా ఉంది.. ఎన్టీఆర్ ప్రశంసలు
ఇప్పుడే సినిమా చూశా.. చాలా అద్బుతంగా ఉంది.. ఎన్టీఆర్ ప్రశంసలు
తులం బంగారానికి లచ్చన్నర పెట్టాల్సిందే!
తులం బంగారానికి లచ్చన్నర పెట్టాల్సిందే!
వికెట్ కీపర్ బ్యాటర్ డైట్ ప్లాన్ లో ఉన్న ట్విస్ట్ ఏంటో తెలుసా?
వికెట్ కీపర్ బ్యాటర్ డైట్ ప్లాన్ లో ఉన్న ట్విస్ట్ ఏంటో తెలుసా?
వచ్చే నెలలోనే విజయ్ దేవరకొండతో పెళ్లి.. రష్మిక సమాధానమిదే..వీడియో
వచ్చే నెలలోనే విజయ్ దేవరకొండతో పెళ్లి.. రష్మిక సమాధానమిదే..వీడియో
ఇక బయటికి పో మిచెల్‌ను గ్రౌండ్‌ నుంచి గెంటేసిన కోహ్లీ
ఇక బయటికి పో మిచెల్‌ను గ్రౌండ్‌ నుంచి గెంటేసిన కోహ్లీ