Dance Icon-Aha: ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోన్న ఓంకార్.. ఆహాతో కలిసి డాన్స్ ఐకాన్.. ఆడిషన్స్ ఎప్పటినుంచంటే ?..
ఇప్పుడు యాంకర్ ఓంకార్‌తో కలిసి డాన్స్ ఐకాన్ రియాలిటీ షోను చేయబోతున్నట్లుగా ప్రకటించింది..
బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ ఓంకార్ (Omkar) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఎన్నో రియాలిటీ షోలతో ఆడియన్స్‌ను అలరించాడు.. మాయద్వీపం, ఆట వంటి రియాలిటీ షోలతో ఫేమస్ అయ్యారు. ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫాంలోకి ఎంట్రీ ఇస్తున్నారు ఓంకార్.. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాతో కలిసి డాన్స్ ఐకాన్ రియాలిటీ షో నిర్వహించనున్నారు. తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు 100 శాతం ఎంటర్టైన్మెంట్ అందిస్తూ దూసుకుపోతుంది ప్రముఖ ఓటీటీ ఆహా. సూపర్ హిట్ చిత్రాలు.. థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ మాత్రమే కాకుండా.. టాక్ షోస్ తో సినీ ప్రియులను అలరించిన ఆహా.. ఇటీవలే తెలుగు ఇండియన్ ఐడల్ షో ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు యాంకర్ ఓంకార్‌తో కలిసి డాన్స్ ఐకాన్ రియాలిటీ షోను చేయబోతున్నట్లుగా ప్రకటించింది..
ఈ సందర్భంగా ఓంకార్ మాట్లాడుతూ.. ఈ షో ద్వారా నేను ఓటీటీ ప్లాట్ ఫాంలోకి అడుగుపెడుతున్నాను.. నాకు ఈ అవకాశం ఇచ్చిన అరవింద్ గారికి, ఆహాకు ధన్యవాదాలు.. ఎన్నో డాన్స్ షోస్ చేశాను.. కానీ ఇది సరికొత్తగా విభిన్నంగా ఉండబోతుంది.. ఈ షో కంటెస్టెంట్స్ తోపాటు వారిని కొరియోగ్రాఫ్ చేసే మాస్టర్స్ జీవితాలను కూడా మార్చేస్తుంది.. గెలిచిన కంటెస్టెంట్, కొరియోగ్రాఫర్ కు టాలీవుడ్ లో ఒక పెద్ద హీరోకి డాన్స్ కొరియోగ్రఫీ చేసే అవకాశం వస్తుంది.. అది ఎవరు అని మేము ఫినాలేలో చెప్తాము.. అందుకే ఈ షో మీ కోసమే. మీరు డాన్స్ చేయగలరు అనుకుంటే తప్పకుండా ఇందులో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు..
ఇదిలా ఉంటే.. ఈ షో జూన్ 22 నుంచి ఆడిషన్స్ ప్రారంభం కానున్నాయి.. ఇందుకు సంబంధించిన డిజిటల్ ఆడిషన్స్ జూలై 10 వరకు నిర్వహిస్తాము.. 5 నుంచి 50 మధ్యలో ఉన్న తెలుగు రాష్ట్రాలకు చెందినవారు 60 సెకండ్స్ ఉండే మీ డాన్స్ వీడియోలను danceikon@oakentertainments.com అనే ఈమెయిల్ కు పంపాల్సి ఉంటుంది..
Dance show like never before! ? We are happy to associate with #OakEntertainments to bring a unique show Dance IKON – The battle of the best. Hurry up, auditions open now! Send your auditions to danceikon@oakentertainments.com#Omkar pic.twitter.com/PDGsfs8idv
— ahavideoin (@ahavideoIN) June 22, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.