AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ante Sundaraniki: సుందరం ఓటీటీలో సందడి చేయనున్నాడు.. ఎప్పుడు.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే ?..

ఇందులో నాని హిందూ అబ్బాయి సుందరం పాత్రలో.. నజ్రియా క్రిస్టియన్ అమ్మాయి లీలా థామస్ పాత్రలో కనిపించారు.

Ante Sundaraniki: సుందరం ఓటీటీలో సందడి చేయనున్నాడు.. ఎప్పుడు.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే ?..
Nani
Rajitha Chanti
|

Updated on: Jun 22, 2022 | 3:49 PM

Share

న్యాచురల్ స్టార్ నాని, మలయాళ బ్యూటీ నజ్రియా జంటగా నటించిన చిత్రం అంటే సుందరానికీ (Ante Sundaraniki). బ్రోచేవారెవరురా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ మూవీ జూన్ 10న విడుదలై ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.  ప్రముఖ నిర్మాణ సంస్త మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‏ తెలుగు, తమిళ్ , మలయాళ భాషల్లో విడుదలైంది. ఇందులో నాని హిందూ అబ్బాయి సుందరం పాత్రలో.. నజ్రియా క్రిస్టియన్ అమ్మాయి లీలా థామస్ పాత్రలో కనిపించారు. మతాంతర వివాహం అనే సీరియస్ టాపిక్ ని ఫుల్ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్‏గా రూపొందించారు డైరెక్టర్ వివేక్.. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేయనుందట… ఇప్పటికే అంటే సుందరానికీ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది..

లేటేస్ట్ టాక్ ప్రకారం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో జూలై 8 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. తెలుగుతోపాటు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్. ప్రస్తుతం నాని.. దసరా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహిస్తున్నారు. జాతీయ అవార్డు విజేత కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న నాని తొలి పాన్ ఇండియా చిత్రంగా రాబోతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?