Vijayakanth Health Update: విజయకాంత్‌కు సర్జరీ.. కాలి వేళ్లు తొలగింపు.. రజినీకాంత్ ట్వీట్ వైరల్..
కొంతకాలంగా ఆయన మధుమేహంతో బాధపడుతున్నారు. ఆయన కుడి కాలి వేళ్లకు రక్తం సరఫరా కావడం లేదు.. సోమవారం వైద్యులు వాటిని అత్యవసరంగా తొలగించారు..
తమిళ్ సీనియర్ అగ్రకథానాయకుడు.. డీఎండికే పార్టీ అధినేత విజయకాంత్ (Vijayakanth) అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన మధుమేహం.. ఇతర సమస్యలతో బాధపడుతున్నారని కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపించాయి. తాజాగా మంగళవారం డీఎండికే పార్టీ కార్యాలయం నుంచి ఆయన హెల్త్ అప్డేట్ విడుదల చేశారు.. “కొంతకాలంగా ఆయన మధుమేహంతో బాధపడుతున్నారు. ఆయన కుడి కాలి వేళ్లకు రక్తం సరఫరా కావడం లేదు.. సోమవారం వైద్యులు వాటిని అత్యవసరంగా తొలగించారు.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విజయకాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉంది.. మరో మూడు రోజుల్లోనే ఆయన కోలుకుంటారు.. అభిమమానులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ” అని వెల్లడించారు..
మరోవైపు విజయకాంత్ ఆరోగ్యంపై సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం స్పందించారు.. నా ప్రియమిత్రుడు విజయకాంత్ త్వరగా కోలుకుని మునుపటిలా కెప్టెన్ గా గర్జించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అంటూ రజినీ ట్వీట్ చేశారు.. విజయకాంత్ ఇనిక్కుం ఇలమై సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఎక్కువగా పోలీస్ కథల్లోనే నటించి మెప్పించారు..దాదాపు 100కు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు విజయకాంత్. ఆయన నటించిన సినిమాలు తెలుగు, హిందీ భాషలలో డబ్ అయి సూపర్ హిట్ అందుకున్నాయి. సిటీ పోలీస్, కెప్టెన్ ప్రభాకర్, సింధూర పువ్వు, పోలీస్ అధికారి, కమిషనర్ నరసింహ నాయుడు వంటి చిత్రాలు తెలుగులో హిట్ కావడమే కాకుండా టాలీవుడ్ అడియన్స్‌కు సుపరిచితమయ్యారు. విజయకాంత్‌కు ఇద్దరు కుమారులున్నారు.
ట్వీట్..
என் அருமை நண்பர் விஜயகாந்த் அவர்கள் விரைவில் குணமடைந்து பழையபடி கேப்டனாக கர்ஜிக்க வேண்டும் என்று எல்லாம் வல்ல இறைவனை வேண்டுகிறேன்.
— Rajinikanth (@rajinikanth) June 21, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.