Tollywood: ‘పాన్ ఇండియా సినిమాలతో టాలీవుడ్ కళకళలాడుతోంటే.. మాకు మాత్రం గౌరవ వేతనాలు ఇవ్వరా’

ఈ క్రమంలో ఓ కార్మికుడు పెట్రోల్‌ ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయబోయాడు. అలర్టయిన పోలీసులు అతన్ని అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. 24 విభాగాలకు చెందిన కార్మికులు ఒక్కొక్కరుగా ఫెడరేషన్‌కు చేరుకున్నారు.

Tollywood: 'పాన్ ఇండియా సినిమాలతో టాలీవుడ్ కళకళలాడుతోంటే.. మాకు మాత్రం గౌరవ వేతనాలు ఇవ్వరా'
Tollywood Movie Workers Strike
Follow us

|

Updated on: Jun 22, 2022 | 1:36 PM

వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు కదం తొక్కారు. తెలుగు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. శ్రమజీవుల కష్టాన్ని నిర్మాతలు పెద్దమనసుతో అర్థం చేసుకోవాలని నినదించారు. ఈ క్రమంలో ఓ కార్మికుడు పెట్రోల్‌ ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయబోయాడు. అలర్టయిన పోలీసులు అతన్ని అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. 24 విభాగాలకు చెందిన కార్మికులు ఒక్కొక్కరుగా ఫెడరేషన్‌కు చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. నాలుగేళ్లుగా వేతనాలు పెంచలేదని.. దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పాన్ ఇండియా మూవీలతో తెలుగు ఇండస్ట్రీ కళకళలాడుతుంది. అయినా తమకు గౌరవ వేతనాలు పెంచరా అని ప్రశ్నించారు.

ఎవరి వాదన ఎలా ఉందో ఓ సారి చూద్దాం..

1. నోటీస్ ఇవ్వకుండా సమ్మెలోకి ఎలా వెళ్తారని ఫిల్మ్ ఛాంబర్ ప్రశ్నిస్తుంటే.. మరోవైపు సినీ కార్మిక సమాఖ్య 15 రోజుల గడువుతో ఇప్పటికే నోటీస్ ఇచ్చామంటోంది.

ఇవి కూడా చదవండి

2. వేతనాలు పెంచాలన్న డిమాండ్‌కి ఎలాంటి అభ్యంతరాలేవంటుంది ఫిల్మ్ చాంబర్‌. అలాంటప్పుడు మూడేళ్లుగా ఎందుకు వేతనాలు పెంచలేదని కార్మికులు ప్రశ్నిస్తున్నారు.

3. సెట్‌లో సినిమాలకి బ్రేక్ పడలేదని.. ప్రొడ్యూసర్లు యధావిధిగా షూటింగ్‌లకి హజరవుతున్నారని ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు చెబుతున్నాడు. మరోవైపు వేతనాలు పెంచేదాకా షూటింగ్‌లకి హాజరుకాబోమంటున్నారు కార్మికులు.

4. కార్మికుల వేతనాలు పెంచేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ఇందులో ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు అక్కర్లేదని ఫిల్మ్ చాంబర్‌ మాట. ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని ఇప్పటికైనా పెంచాలంటున్నారు కార్మికులు. అప్పటిదాకా షూటింగ్‌లకి హాజరుకాబోమంటున్నారు.

5. ఫైటర్ షూటింగ్ ఆగిపోవడంతో ఫిర్యాదులు వచ్చాయని.. ఆ కారణంగా రెండు కోట్ల నష్టం వచ్చిందని ఫిల్మ్ చాంబర్ గుర్తు చేస్తోంది. ఆరు నెలలుగా కార్మిక సమాఖ్య సంప్రదింపులు జరుపుతుందని అయినా స్పందన లేకపోవడంతోనే సమ్మెకి వెళ్లామంటున్నారు కార్మికులు.

6. కార్మికులు సమ్మెకి వెళ్లకుండా సంప్రదింపులు జరపాలంటోంది ఫిల్మ్ చాంబర్‌. కానీ కార్మికులు మాత్రం సమ్మెకి సై అంటున్నారు. వేతనాలు పెంచేదాకా తగ్గేదేలే అని తెగేసి చెబుతున్నారు.

సినీ కార్మిక సమాఖ్య సమ్మెతో ప్రస్తుతం సెట్‌లో ఉన్న సినిమాలపై ప్రభావం పడే ఛాన్స్ ఉంది. ఆ సినిమాలేంటో ఇఫ్పుడు చూద్దాం..

హైదరాబాద్‌లో ‘భోళా శంకర్’ షూటింగ్‌

కోకాపేట్‌లో సల్మాన్‌ ఖాన్ మూవీ ‘కభీ ఈద్‌ కభీ దివాలి’

అన్నపూర్ణ స్టూడియోలో విజయ్‌ దేవరకొండ-సమంత మూవీ

ముంబయ్‌లో పూరి జగన్నాథ్‌ మూవీ ‘జనగణమన’

అల్యూమినియం ఫ్యాక్టరీలో రవితేజ సినిమా ‘రావణాసుర’

సాయి ధరమ్‌ తేజ్‌-కార్తీక్‌ దండు డైరెక్షన్‌లో మూవీ

రామోజీ ఫిలిం సిటీలో హీరో ధనుష్‌ మూవీ షూటింగ్‌

అల్యూమినియం ఫ్యాక్టరీలో అల్లరి నరేష్‌ ‘మారేడుమిల్లీ ప్రజానీకం’

Latest Articles