Salman Khan: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గోన్న సల్మాన్ ఖాన్.. అనర్థాలు ఆగాలంటే చెట్లు పెంచాలంటున్న హీరో…
మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి.. మొక్కను నాటమా ? పని అయిపోయిందా ? అని కాకుండా మొక్క పెరిగే వరకు శ్రద్ద తీసుకోవాలి.. అకాల వర్షాలు, వరదలు,
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం హైదరాబాద్‌లో సందడి చేస్తున్నారు. ఆయన నటిస్తోన్న కభీ ఈద్ కభీ దివాళీ సినిమా గత కొద్ది రోజులుగా భాగ్యనగరంలోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రానికి ఫర్హద్ సమ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం సినీ కార్మికుల సమ్మె కారణంగా ఆయన సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది.. దీంతో విరామ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్‌లతో కలిసి ఓ ప్రైవేట్ పార్టీలో సందడి చేశారు సల్మాన్..తాజాగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గోన్నారు.. వీరిద్దరు రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కలు నాటారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా సల్మాన్ మాట్లాడుతూ.. వాతావరణంలో జరిగే అనర్థాలు ఆగాలంటే మనం చెట్లు నాటడం ఒక్కటే మార్గమన్నారు.. ఆ పనికి ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా బాటలు వేసారన్నారు..
“మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి.. మొక్కను నాటమా ? పని అయిపోయిందా ? అని కాకుండా మొక్క పెరిగే వరకు శ్రద్ద తీసుకోవాలి.. అకాల వర్షాలు, వరదలు, విపత్తులతో మన కళ్ల ముందే దేశంలో అనేక మంది ప్రజలు చనిపోతుండడం బాధకరమన్నారు. వాతావరణ మార్పులతో జరిగే అనర్థాలు ఆగాలంటే మనం చెట్లు నాటడం ఒక్కటే మార్గమన్నారు.. ఆ పనికి ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా బాటలు వేసారు.. ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తే నేలకు, భవిష్యత్ తరాలను కాపాడుకోవచ్చు..నా అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గోని మొక్కలు నాటాలి ” అని కోరారు సల్మాన్.
I have accepted #GreenindiaChallenge from @MPsantoshtrs garu and I have planted saplings at Ramoji Film City . I request all my fans to perticapate in this challenge to control global warming… pic.twitter.com/JXND8Gk4VY
— Salman Khan (@BeingSalmanKhan) June 22, 2022
ఇవి కూడా చదవండి
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.