AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఏపీలో ఇకపై తక్కువ ధరకే సినిమా టిక్కెట్లు..

ఇతర పోర్టల్స్‌ కంటే రూ. 20 నుంచి రూ.25 రూపాయల తక్కువకే (movie ticket price) టికెట్లను విక్రయించనున్నారు. థియేటర్లకు కూడా ఏ రోజు డబ్బులను ఆరోజే ఇస్తామని ఏపీ సర్కార్‌ చెబుతోంది.

Andhra Pradesh: జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఏపీలో ఇకపై తక్కువ ధరకే సినిమా టిక్కెట్లు..
Movie Theatre
Shaik Madar Saheb
|

Updated on: Jun 23, 2022 | 5:56 AM

Share

Online portal for movie tickets: ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్లాక్ టికెటింగ్ విధానానికి స్వస్తి పలికి.. ఏపీలో ఇకపై ఆన్‌లైన్‌ ద్వారానే సినిమా టికెట్ల అమ్మకాలు జరిపేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగా ఏపీ సర్కార్‌ ఆన్‌లైన్‌ టికెట్ల బుకింగ్‌ కోసం యువర్‌ స్క్రీన్స్‌ పోర్టల్‌ని తీసుకొస్తోంది. ఇతర పోర్టల్స్‌ కంటే రూ. 20 నుంచి రూ.25 రూపాయల తక్కువకే (movie ticket price) టికెట్లను విక్రయించనున్నారు. థియేటర్లకు కూడా ఏ రోజు డబ్బులను ఆరోజే ఇస్తామని ఏపీ సర్కార్‌ చెబుతోంది. ఇటు ఇతర పోర్టల్స్‌తోనూ ఒప్పందాలు కొనసాగించనుంది ప్రభుత్వం. దీనివల్ల ప్రేక్షకులు నచ్చిన పోర్టల్‌ నుంచి టికెట్లు బుక్‌ చేసుకునే అవకాశం ఉంది. యువర్‌ స్క్రీన్స్‌ పోర్టల్‌ త్వరలోనే అందుబాటులోకి రానుంది.

యువర్ స్క్రీన్స్‌ పోర్టల్‌ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే అదనపు ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ప్రభుత్వం తెచ్చిన ఆన్‌లైన్ విధానంతో థియేటర్లకు ఉన్న గత ఒప్పందాలు రద్దు కావని ఏపీఎఫ్‌డీసీ ఎండీ విజయ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలను మాత్రమే థియేటర్ల యాజమాన్యాలు అమలు చేయాలని.. అందుకోసం ఆన్‌లైన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు విజయ్ తెలిపారు.

కాగా.. సినిమా టిక్కెట్లు అందరికీ అందుబాటులో ఉండాలని కొంతకాలంగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. దీనికోసం ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులతో సమావేశాలు కూడా నిర్వహించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..